Beauty Tips

Rose Water: రోజ్ వాటర్ తో ఇలా చేస్తే ఒక్క వెంట్రుక కూడా రాలదు..

Rose Water: రోజ్ వాటర్ తో ఇలా చేస్తే ఒక్క వెంట్రుక కూడా రాలదు.. ఇప్పటివరకు రోజు వాటర్ లో బ్యూటీ ప్రయోజనాలు ఉన్న విషయం మాత్రమే మనకు తెలుసు. అయితే జుట్టుకు సంబంధించిన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రోజ్ వాటర్ లో ఇప్పుడు చెప్పే కొన్ని పదార్థాలు కలిపి రాస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది’

ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్యతో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రాలడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. వాతావరణంలో మార్పులు, పోషకాహారం తీసుకోకపోవడం, జుట్టుకు సరైన సంరక్షణ లేకపోవడం వంటివి జుట్టు రాలటానికి కారణం కావచ్చు.

అయితే జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడేస్తూ ఉంటారు. ఆలా కాకుండా మన ఇంటి చిట్కాలతో చాలా సులభంగా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.

రోజు వాటర్ లో విటమిన్ ఏ, బి3, సి, విటమిన్ ఈ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. రోజ్ వాటర్ ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు బాగా పట్టించి రెండు మూడు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి జుట్టు రాలకుండా పెరుగుతుంది.

రోజ్ వాటర్ లో ఆలివ్ లేదా కొబ్బరి నూనె కలిపి జుట్టుకు పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టుకు అవసరమైన పోషణ అందుతుంది.

రెగ్యులర్ గా వాడే షాంపూలో కొంచెం రోజు వాటర్ కలిపి వాడితే తల మీద చర్మం శుభ్రంగా ఉంటుంది. జుట్టు మృదువుగా మెరిసేలా చేస్తుంది. నాచురల్ లేదా హోం మేడ్ రోజ్ వాటర్ ఉపయోగిస్తే మంచిది. అలాగే వారంలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."