Beauty Tips

Face Glow: 40 ఏళ్లు దాటినా ముఖంపై ముడతలు రావద్దంటే, ఇలా చేస్తే చాలు..!

Face Glow: 40 ఏళ్లు దాటినా ముఖంపై ముడతలు రావద్దంటే, ఇలా చేస్తే చాలు.. వయసు పెరిగే కొద్దీ ముఖం మీద ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మొటిమలు, మచ్చలు, ముడతలు ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. వయసు పెరిగిన యవ్వనంగా అందంగా కనిపించాలంటే ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.

అయితే మనలో చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ రాస్తూ ఉంటారు.. లేదంటే మేకప్ తో ముఖాన్ని కవర్ చేస్తూ ఉంటారు. మేకప్ అనేది శాశ్వతం కాదు. మనం ఇంటి చిట్కాలను ఫాలో అయితే ముఖం మీద ముడతలు లేకుండా ముఖ్యంగా 40 ఏళ్ళు దాటాక యవ్వనంగా కనిపిస్తారు.

పెరుగు చర్మానికి చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇందులో లాక్టిక్ ఆమ్లం ఉండటం వలన మొటిమలు, మొటిమలకు కారణమైన మచ్చలను తగ్గించడానికి సహాయపడటమే కాకుండా చర్మానికి అవసరమైన పోషణ అందిస్తుంది.

అంతేకాకుండా చర్మం తేమగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. చర్మాన్ని సహజసిద్ధంగా ఎక్స్ పోలియట్ చేస్తుంది.ముఖం మీద దుమ్ము, ధూళి, మలినాలను తొలగించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

తేనె కూడా చర్మానికి మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే తేనె చర్మానికి తేమ అందించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా చర్మానికి మెరుపు, కాంతిని ఇవ్వడంలో సహాయపడుతుంది. పొడి చర్మం, ముడతలు లేకుండా చర్మాన్ని ఎక్స్ పోలియోట్ చేయడానికి తేనె చాలా బాగా సహాయపడుతుంది. అంతే కాకుండా మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

మెంతులు ఆరోగ్యానికి మాత్రమే సహాయపడతాయని మనలో చాలా మంది అనుకుంటారు. అయితే మెంతులలో బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చర్మం, జుట్టు సమస్యలకు చెక్ పెడుతుంది. మొటిమలు, మొటిమల కారణంగా వచ్చే మచ్చలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది.

చర్మం నిస్తేజంగా అనారోగ్యంగా ఉన్న చర్మాన్ని ఉత్తేజంగా చేస్తుంది. మెంతుల్లో డయో స్జెనిన్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు ఉండటం వలన మొటిమలతో పోరాటం చేయటమే కాకుండా ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేసి ముడతలు, బ్లాక్ హెడ్స్ లేకుండా చేస్తుంది.

ఒక బౌల్లో మెంతులను వేసి నీటిని పోసి దాదాపుగా 8 గంటల పాటు నానబెట్టాలి. నానిన మెంతులను మిక్సీ జార్లో వేసి దానిలో రెండు స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలిపి మిక్సీ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖము, మెడపై అప్లై చేసి బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన వయసు పెరిగిన యవ్వనంగా ఉంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."