Sleeping Tips:నిద్రలేమితో బాధపడుతున్నారా.. పాలలో ఈ రెండు కలిపి తాగితే చాలు..
Sleeping Tips:నిద్రలేమితో బాధపడుతున్నారా.. పాలలో ఈ రెండు కలిపి తాగితే చాలు.. మన ఆరోగ్యం బాగుండాలంటే ప్రశాంతమైన నిద్ర అవసరం. మనలో చాలా మందికి నిద్ర పట్టగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు ఇప్పుడు చెప్పే ఈ పాలను తాగితే ప్రశాంతంగా నిద్రపోతారు.
అశ్వగంధ పొడి
ఇది ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. నాడీ వ్యవస్థను శాంత పరిచి మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. నిద్రలేమికి ప్రధాన కారణమైన కార్తిస్టాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అశ్వగంధలోని ట్రైఇథిలీన్ గ్లైకాల్ అనే రసాయనం నిద్రను ప్రేరేపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి
జాజికాయ పొడి
జాజికాయ ఒక అద్భుతమైన ఔషధ గుణాలున్న పొడి. ఇది సహజసిద్ధంగా మత్తు ముందుగా పనిచేస్తుంది.జాజికాయలో మిరిస్టిసిన్ అనే సమ్మేళనం ఉంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసి నిద్రను ప్రోత్సహిస్తుంది.
ఒక గ్లాసు పాలల్లో చిటికెడు జాజికాయ పొడి,పావు స్పూన్ అశ్వగంధ పొడి కలిపి తాగితే నిద్ర బాగా పడుతుంది. ఈ పాలను పడుకోవటానికి అరగంట ముందు తాగితే సరిపోతుంది. పంచదారకు బదులు తేనె కలుపుకోవచ్చు.
కొన్ని రోజుల పాటు ఈ పాలు తాగితే నిద్ర బాగా పడుతుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పాలను తాగే ముందు వైద్యుల్ని సంప్రదించాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

