Summer Tips:వేసవిలో నీరసం రాకుండా పాటించాల్సిన చిట్కాలు ఇవే..
Summer Tips:వేసవిలో నీరసం రాకుండా పాటించాల్సిన చిట్కాలు ఇవే.. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అలాగే.. పని ఒత్తిడి లేదా నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల చాలా మంది రోజంతా అలసిపోయినట్లుగా, నీరసంగా ఫీలవుతారు. ఇలాంటప్పుడు తక్షణ శక్తిని పొందడానికి.ఈ చిట్కాలను ట్రై చేయండి.
వేసవికాలంలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.కాబట్టి నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. వేసవి కాలంలో నీరసం అనేది సర్వసాధారణంగా వస్తుంది. నీరసం రాకుండా చూసుకోవాలి. నీరసం, తల తిరగడం, వాంతులు వంటి సమస్యలు ఉన్నప్పుడు ఎండు ఉసిరి, ధనియాలు కలిపి కషాయం చేసుకొని తాగితే సరిపోతుంది.
తిన్న తర్వాత ఒకే చోట కూర్చుంటే నీరసం వస్తుంది. కాబట్టి వేసవిలో కొంత సమయం వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలి. అంతేకాకుండా మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడం చేయాలి. వేసవికాలంలో నీరసం రాకుండా ఉండాలి అంటే ఆకుకూరలు, గుమ్మడి గింజలు మాంసం వంటి ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.
అలాగే ఈ వేసవికాలంలో టీ కాఫీలకు బదులుగా విటమిన్ సి సమృద్ధిగా ఉన్న పండ్లు తినాలి. ముఖ్యంగా రోజుకు రెండు ఎండు ద్రాక్షను నానబెట్టి తింటే మంచిది. నీరసం, అలసట వంటివి ఏమీ ఉండవు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

