Healthhealth tips in telugu

Honey With Turmeric:పసుపు, తేనె కలిపి తీసుకుంటే..ఎన్ని లాభాలో తెలుసా !

Honey With Turmeric:పసుపు, తేనె కలిపి తీసుకుంటే..ఎన్ని లాభాలో తెలుసా.. ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవనశైలిలో ఆహారం తయారు చేసుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు. సంపాదనలో మునిగిపోయి చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ తగ్గిస్తున్నారు, దీంతో చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

అయితే, ఇప్పుడు ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతోంది. చాలా మంది ఆయుర్వేద విధానాలను అనుసరిస్తూ, ఇంట్లో లభ్యమయ్యే సహజ చిట్కాలను పాటిస్తున్నారు. ఈ క్రమంలో పసుపు మరియు తేనెల మిశ్రమం ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

పసుపు మరియు తేనె మిశ్రమం జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుంది. ఇది సహజ లాక్సేటివ్‌గా పనిచేసి, సుఖవిరోచనానికి తోడ్పడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్‌ వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఈ మిశ్రమంలో విటమిన్‌ ఏ ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేసి, కణాలను రక్షిస్తాయి. పసుపు-తేనె మిశ్రమం ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంతో పాటు జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పసుపు, తేనె కలిపి తాగితే చర్మం లోపలి నుంచి శుభ్రమై, కాంతివంతంగా మారుతుంది. ఈ మిశ్రమం శరీరంలో డీటాక్సిఫికేషన్‌ను ప్రోత్సహించి, మొటిమలు, ముడతలు వంటి సమస్యలను తగ్గిస్తుంది. అదనంగా, ఈ కషాయం జీవక్రియను వేగవంతం చేస్తుంది, ఆకలిని నియంత్రించి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

పసుపు మరియు తేనె విడిగా కూడా అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి, కానీ వీటిని కలిపి తీసుకుంటే శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు చేకూరతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని తీసుకునే అలవాటు చేసుకుంటే, కేవలం 15 రోజుల్లోనే శరీరంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ