Coffee For Face:ఈ కాఫీ మాస్క్ తో అందమైన ముఖం సొంతం
Coffee Face MAsk:మెరిసే, ప్రకాశవంతమైన ముఖ చర్మం కావాలని కోరుకుంటున్నారా? అందమైన చర్మం కోసం రకరకాల స్కిన్ కేర్ ఉత్పత్తులను వాడుతున్నారా? అయితే, సహజంగా సూపర్ బ్రైట్ స్కిన్‌ను సొంతం చేసుకోవడానికి ఈ కాఫీ మాస్క్ అద్భుతంగా సహాయపడుతుంది. ఈ మాస్క్ తయారీ మరియు ఉపయోగం గురించి తెలుసుకుందాం.
తయారీ విధానం:
1. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసి బాగా కలపండి.
2. అందులో 1 కప్పు నీరు పోసి, ఉండలు లేకుండా స్మూత్‌గా మిక్స్ చేయండి.
3. ఈ మిశ్రమాన్ని స్టవ్‌పై ఉంచి, 5-6 నిమిషాలు ఉడికించి, స్మూత్ క్రీమ్‌లా తయారు చేయండి.
4. క్రీమ్‌ను చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత, 1 టీ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ మరియు 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ (లేదా అవిసె గింజల జెల్) వేసి బాగా కలపండి.
5. ఈ మిశ్రమాన్ని ఒక డబ్బాలో నింపి, ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తే వారం రోజులపాటు ఉపయోగించవచ్చు.
ఉపయోగం:
– ముఖంపై మేకప్ ఉంటే తొలగించి, నీటితో శుభ్రంగా కడిగి, ముఖం మరియు మెడపై ఈ మాస్క్‌ను అప్లై చేయండి.
– 20 నిమిషాలు ఆరనివ్వండి, ఆపై నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగేయండి.
ప్రయోజనాలు:
– వారానికి రెండుసార్లు ఈ కాఫీ మాస్క్ ఉపయోగిస్తే చర్మం బిగుతుగా, ప్రకాశవంతంగా మారుతుంది.
– చర్మంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.
– మొండి మచ్చలు క్రమంగా మాయమవుతాయి, చర్మం స్మూత్‌గా, మచ్చలు లేకుండా మారుతుంది.
– చర్మం రంగు మెరుగుపడుతుంది, పిగ్మెంటేషన్ సమస్య తగ్గుతుంది.
– చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
ప్రకాశవంతమైన, మచ్చలు లేని చర్మం కోసం ఈ సహజ కాఫీ మాస్క్‌ను తప్పక ప్రయత్నించండి!
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

