Beauty Tips

Hair Care Tips:​నాగుపాము లాంటి పొడవైన జడ కోసం ఈ సీడ్స్ ఇలా వాడితే సరి..

Hair Care Tips:​నాగుపాము లాంటి పొడవైన జడ కోసం ఈ సీడ్స్ ఇలా వాడితే సరి.. రాత్రిపూట నానబెట్టిన చియా గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

చియా విత్తనాలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, జింక్, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అంతేకాక, జుట్టు సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పొడవైన, బలమైన జుట్టు అందరి ఆకర్షణను పెంచుతుంది. అందుకే చాలామంది మహిళలు పొడవైన, ఆకర్షణీయమైన జుట్టు కోసం వివిధ జుట్టు సంరక్షణ పద్ధతులను అనుసరిస్తారు. అయితే, చియా విత్తనాలతో మెరిసే, బలమైన, ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చని మీకు తెలుసా? అవును, చియా విత్తనాలను ఉపయోగించి జుట్టును బలంగా, ఒత్తుగా, పొడవుగా పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాగో తెలుసుకుందాం.

చియా గింజలు ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి చిన్నవిగా కనిపించినా, వాటిలోని పోషకాలు అత్యంత శక్తివంతమైనవి. రాత్రి నిద్రించే ముందు వీటిని తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు.

రాత్రి చియా గింజలను తీసుకుంటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉండి, ఉదయాన్నే తాజాగా అనిపిస్తుంది. చిన్నగా కనిపించే ఈ గింజలు శక్తివంతమైన పోషకాలతో నిండి ఉంటాయి.

జుట్టు సంరక్షణ కోసం, 2 టేబుల్ స్పూన్ల చియా విత్తనాలను అర కప్పు నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టాలి. అవి జెల్ లాంటి ఆకృతిని సంతరించుకున్న తర్వాత, ఈ మిశ్రమాన్ని తల మరియు జుట్టు మొత్తానికి పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రంగా కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల తల హైడ్రేటెడ్‌గా ఉంటుంది మరియు పొడితనం తగ్గుతుంది.

అలాగే, నానబెట్టిన చియా విత్తనాలను అలోవెరా జెల్‌తో కలిపి, ఈ మిశ్రమాన్ని తల మరియు జుట్టుకు రాసి, 10-15 నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇది దురద మరియు చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ