Beauty Tips

Skin Care Tips: ప్రకాశవంతమైన మెరిసే చర్మం కావాలా.. ఈ చిట్కాను రాత్రి పడుకునే ముందు ట్రై చేయండి..

Skin CAre Tips:మంచి, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందేందుకు సహజమైన మార్గాలను అనుసరించడం చాలా మంచిది. అతి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారుచేసుకునే ఫేస్ ప్యాక్స్ ద్వారా మంచి మెరుపును పొందవచ్చు.

1. బియ్యం పిండి, మైదా, పెరుగు ఫేస్ ప్యాక్
కావాల్సిన పదార్థాలు:
– 1 టీస్పూన్ బియ్యం పిండి
– 1/2 టీస్పూన్ మైదా
– 2 టేబుల్ స్పూన్స్ పెరుగు
– చిటికెడు పసుపు
– 2 టీస్పూన్స్ నిమ్మరసం

తయారీ విధానం:
1. చిన్న గిన్నె తీసుకుని బియ్యంపిండి, మైదా, పెరుగు, పసుపు, నిమ్మరసం కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి.
2. ఈ ప్యాక్ అప్లై చేసే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
3. ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత మసాజ్ చేస్తూ గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
4. వారానికి ఒకసారి చేస్తే మృత కణాలు తొలగిపోయి మెరుపు పెరుగుతుంది.

2. బియ్యం పిండి, పెరుగు ఫేస్ ప్యాక్
తయారీ:
– రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి కలిపి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.
– 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
– ఇలా వారానికి రెండు సార్లు చేస్తే, ముఖం తాజాగా మెరుస్తుంది.

3. కాఫీ పొడి, మిల్క్ ఫేస్ ప్యాక్
తయారీ:
– రెండు టేబుల్ స్పూన్స్ కాఫీ పొడి, రెండు టేబుల్ స్పూన్స్ పాలు కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి.
– ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.
– మృత కణాలు తొలగిపోతాయి, ముఖం మరింత కాంతివంతంగా మారుతుంది.

4. శెనగపిండి, పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్
తయారీ:
– రెండు టేబుల్ స్పూన్స్ శెనగపిండి, చిటికెడు పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి.
– ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
– ఇది మొటిమలు, మచ్చలు తొలగించడానికి సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకునే చిట్కాలు
– రోజూ ఎక్కువ నీరు తాగడం ముఖంపై నిగారింపు ఇస్తుంది.
– ఆహారంలో విటమిన్ C, E ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి.
– కనీసం 7-8 గంటలు నిద్రపోవడం ముఖాన్ని తాజాగా ఉంచుతుంది.
– ఎండలో ఎక్కువ సేపు వెళ్లకుండా రక్షణ తీసుకోవాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."