Beauty Tips

Glowing Skin: ముఖం తెల్లగా మారాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Glowing Skin: ముఖం తెల్లగా మారాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ప్రతి ఒక్కరూ కోమలమైన, కాంతివంతమైన చర్మం కోరుకుంటారు. కానీ, ఈ రోజుల్లో జీవనశైలి మార్పులు, ఆహార అలవాట్లు, ఒత్తిడి, కాలుష్యం, దుమ్ము వంటి కారణాల వల్ల ముఖంపై ట్యాన్, మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

చర్మ సౌందర్యం కోసం చాలామంది మార్కెట్లో దొరికే రసాయనిక క్రీములను ఉపయోగిస్తున్నారు, ఫలితంగా కొన్నిసార్లు చర్మం దెబ్బతింటోంది. అందుకే, సహజసిద్ధమైన ఈ చిట్కాలతో చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కొబ్బరి పాలు, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్, 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలను గోరువెచ్చని నీటిలో కలపండి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు ముఖానికి రాసి, 20 నిమిషాల తర్వాత కడిగేయండి. రెండు రోజులకు ఒకసారి ఇలా చేస్తే, చర్మం తాజాగా, యవ్వనంగా కనిపిస్తుంది.

2. కొబ్బరి పాలు, అలోవెరా జెల్ ఫేస్ ప్యాక్
ఒక గిన్నెలో కొబ్బరి పాలు తీసుకుని, అందులో 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మర్దనా చేస్తూ కడిగేయండి. వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే, మొటిమలు, మచ్చలు తొలగి, చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

3. కొబ్బరి పాలు, గులాబీ రేకులు, తేనె ఫేస్ ప్యాక్
పావు కప్పు కొబ్బరి పాలు, కొన్ని గులాబీ రేకులు, 2 టేబుల్ స్పూన్ల తేనె కలిపి ముఖం, మెడకు రాయండి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. రోజూ లేదా వారానికి 3 సార్లు ఇలా చేస్తే, చర్మం మిలమిలలాడుతూ కాంతివంతంగా కనిపిస్తుంది.

4. కొబ్బరి పాలు, నిమ్మరసం ఫేస్ ప్యాక్
ఒక గిన్నెలో 5 టీ స్పూన్ల కొబ్బరి పాలు, 2 టీ స్పూన్ల నిమ్మరసం కలపండి. 5 నిమిషాల తర్వాత దూదితో ఈ మిశ్రమాన్ని ముఖం అంతా రాసి, కాసేపు ఆగిన తర్వాత కడిగేయండి. ఇలా చేస్తే ముఖంపై మురికి తొలగి, చర్మం తాజాగా కనిపిస్తుంది.

5. కొబ్బరి పాలు, బాదం పొడి, తులసి పొడి ఫేస్ ప్యాక్
పావు కప్పు కొబ్బరి పాలలో 1 టీ స్పూన్ బాదం పొడి, 1 టీ స్పూన్ తులసి పొడి, 1 టీ స్పూన్ తేనె కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. వారానికి 2 సార్లు ఇలా చేస్తే, మృతకణాలు తొలగి, చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ