Lightest Smartphones: కొత్త స్మార్ట్ ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా.. అతి తేలికైన ఫోన్స్ ఇవే..
Lightest Smartphones: కొత్త స్మార్ట్ ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా.. అతి తేలికైన ఫోన్స్ ఇవే..కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? భారత మార్కెట్‌లో తేలికైన బరువు కలిగిన అనేక స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. తేలికైన ఫోన్‌లను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
పెద్ద స్క్రీన్‌తో పాటు శక్తిమంతమైన బ్యాటరీలు కలిగిన కొన్ని బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లో లభిస్తున్నాయి. 200 గ్రాముల కంటే తక్కువ బరువున్న టాప్ 5 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీ కోసం అందిస్తున్నాము. ఇందులో మీకు నచ్చిన ఫోన్‌ను ఎంచుకోండి.
శాంసంగ్ గెలాక్సీ S25(Samsung Galaxy S25 5G):
శాంసంగ్ గెలాక్సీ S25 అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, 50MP ప్రైమరీ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా, 4000mAh బ్యాటరీని కలిగి ఉంది. 6.2-అంగుళాల AMOLED స్క్రీన్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ, IP68 రేటింగ్‌తో వస్తుంది. S24 వెర్షన్‌తో పోలిస్తే మరింత అధునాతన ఫీచర్లను అందిస్తుంది. ఈ ఫోన్ బరువు కేవలం 162 గ్రాములు.

షావోమీ CIVI 5(Xiaomi Civi 5):
షావోమీ CIVI సిరీస్ అద్వితీయ స్పెసిఫికేషన్‌లతో ఆకర్షిస్తుంది. కర్వడ్ OLED స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌తో స్టైలిష్ డిజైన్‌ను అందిస్తుంది. స్లిమ్ లుక్, గ్లాస్ కోటింగ్, వివిధ కలర్ ఆప్షన్‌లతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ బరువు కేవలం 169 గ్రాములు.

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (Motorola Edge 50 Fusion):
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో కర్వడ్ pOLED స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌ను కలిగి ఉంది. వీగన్ లెదర్ ఫినిషింగ్‌తో సౌకర్యవంతమైన గ్రిప్ అందిస్తుంది. ఈ ఫోన్ బరువు 174.9 గ్రాములు.

రియల్‌మి నార్జో 70x 5G(realme narzo 70x 5g):
రియల్‌మి నార్జో 70x 5G అద్భుత ఫీచర్లతో ఆకర్షిస్తుంది. 188 గ్రాముల బరువుతో, 120Hz LCD స్క్రీన్, డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్, IP54 రేటింగ్, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. ఈ 5G ఫోన్ ధర రూ. 12,000 కంటే తక్కువ.

ఐక్యూ Z9 5G(iqoo z9 5g):
ఐక్యూ Z9 5G ఫోన్ 188 గ్రాముల బరువుతో వస్తుంది. డైమెన్సిటీ 7200 చిప్, 120Hz AMOLED డిస్‌ప్లే, OISతో 50MP సోనీ IMX882 కెమెరాను కలిగి ఉంది. సన్నని ఫ్రేమ్‌తో గేమింగ్ లేదా వీడియో ప్లేటైమ్‌కు అనువైనది.


