Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం..
Tiruma:తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం: శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ల కౌంటర్‌ను మూసివేయాలని టీటీడీ నిర్ణయించింది.భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. దివ్య దర్శనం టోకెన్ల జారీ కౌంటర్‌ను అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌కు తరలించినట్లు సమాచారం.
అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో తాత్కాలికంగా దివ్య దర్శనం టోకెన్ కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. జూన్ 6, శుక్రవారం సాయంత్రం నుంచి ఈ కౌంటర్ అందుబాటులోకి రానుంది.
భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్లు పొందిన భక్తులు, శ్రీవారి మెట్టు నడక మార్గంలో 1200వ మెట్టు వద్ద తమ ఆధార్ కార్డును చూపించి స్కానింగ్ చేయించుకోవాలని టీటీడీ సూచించింది. జూన్ 7వ తేదీ దర్శనం కోసం జూన్ 6 సాయంత్రం నుంచి టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

