Devotional

Vastu Tips:వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిశలో కూర్చొని భోజనం చేయాలో తెలుసా..

Vastu Tips:వాస్తు శాస్త్రం ప్రకారం దిశలో కూర్చొని భోజనం చేయాలో తెలుసా.. వాస్తు శాస్త్రం ప్రకారం, సరైన దిశలో కూర్చొని భోజనం చేయడం వల్ల ఆర్థిక, ఆరోగ్య పరంగా అనేక శుభ ఫలితాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా తప్పు దిశలో భోజనం చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. అయితే, ఏ దిశలో కూర్చొని భోజనం చేయడం వల్ల సంపద, ఆరోగ్యం పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ మనం చేసే పనుల్లో ఆహారం తినడం ఒక సాధారణ అంశం. అయితే, చాలా మంది దీని గురించి పెద్దగా పట్టించుకోకుండా, తమకు నచ్చిన దిశలో లేదా స్థలంలో కూర్చొని భోజనం చేస్తారు. కొందరు బెడ్‌రూమ్‌లోనే భోజనం చేస్తుంటారు, కానీ ఇది వాస్తు ప్రకారం సరైనది కాదని నిపుణులు అంటున్నారు.

భోజనం చేసేటప్పుడు సరైన దిశ, సరైన స్థానం ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు, ఇంట్లో సంపద కూడా వృద్ధి చెందుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

వాస్తు నిపుణుల ప్రకారం, తూర్పు దిశలో కూర్చొని భోజనం చేయడం అత్యంత శ్రేష్ఠమైనది. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ సాఫీగా పనిచేయడమే కాక, ఆ ఇంట్లో సంపద కూడా పెరుగుతుందని అంటున్నారు. అందుకే, ప్రతి ఒక్కరూ తూర్పు దిశలో కూర్చొని భోజనం చేయడం మంచిదని సిఫారసు చేస్తున్నారు.

పశ్చిమ దిశలో కూర్చొని భోజనం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు. అయితే, కొందరు తెలియక లేదా తెలిసి దక్షిణ దిశలో కూర్చొని భోజనం చేస్తారు, ఇది అస్సలు మంచిది కాదని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది. దీని వల్ల ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."