Milk with Dates: ఖర్జూరం, పాలు కలిపి తాగితే ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే వదలకుండా తాగుతారు..
Milk with Dates: ఖర్జూరం, పాలు కలిపి తాగితే ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే వదలకుండా తాగుతారు..శరీరంలో ఎముకలు బలంగా, దృఢంగా ఉండాలంటే కాల్షియం అత్యవసరం. అంతేకాకుండా, దంతాల ఆరోగ్యానికి కూడా కాల్షియం తప్పనిసరి. వయసుకు తగ్గట్టుగా కండరాల కదలికలు, ఎముకల సాంద్రత, బలాన్ని కాపాడడంలో కాల్షియం కీలకంగా పనిచేస్తుంది.
అదే విధంగా, మెదడు నుంచి శరీరంలోని వివిధ భాగాలకు సందేశాలను చేరవేయడానికి నరాలకు కాల్షియం అవసరం. రక్త నాళాలు శరీరమంతటా రక్తాన్ని సమర్థవంతంగా తరలించడంలో, హార్మోన్ల విడుదలలో కాల్షియం ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాల్షియం అధికంగా లభించే ఆహారాలను తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పాలు, ఖర్జూరాలలో కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు దీని వివరాల్లోకి వెళదాం…
జీర్ణ సమస్యలతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు ఖర్జూరం కలిపిన పాలు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఖర్జూరం పాలు తాగడం వల్ల నిద్రలేమి సమస్యను అదుపు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఖర్జూరంలో ఐరన్, విటమిన్ సి, డి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి చర్మాన్ని కాంతివంతం చేయడంతో పాటు జుట్టు రాలడాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.
బరువు పెరగాలనుకునే వారు ఖర్జూరాలను పాలలో నానబెట్టి రాత్రి తాగడం ఉత్తమం. ఖర్జూరంలో కేలరీలు, పోషకాలు అధికంగా ఉండటం వల్ల బరువు పెరగడానికి సహాయపడతాయి. ఈ మిశ్రమం కండరాలకు అవసరమైన పోషణను అందిస్తుంది. ఖర్జూరంలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి, ఇవి కండరాల నిర్మాణం, బలానికి ఉపయోగపడతాయి.
రక్తపోటును నియంత్రించడానికి కూడా ఖర్జూరం కలిపిన పాలు తాగడం మంచిది, ఎందుకంటే ఖర్జూరంలో పొటాషియం అధికంగా ఉంటుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

