Healthhealth tips in telugu

Jamun Tree Leaves: నేరేడు ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. ముఖ్యంగా షుగర్ ఉన్నవారిలో..

Jamun Tree Leaves: నేరేడు ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. ముఖ్యంగా షుగర్ ఉన్నవారిలో.. ఆయుర్వేద నిపుణుల ప్రకారం, మధుమేహ రోగులకు నేరేడు ఆకులు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. ఈ ఆకుల్లోని ఔషధ గుణాలు రక్తంలో చక్కెర నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తాయి, దీంతో రక్తంలో షుగర్ స్థాయిలు క్రమంగా తగ్గుతాయి మరియు మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

నేరేడు ఆకుల నుంచి రసం తీసి, పావు టీస్పూన్ మోతాదులో భోజనానికి ముందు తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. లేదా, ఈ ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిని రోజుకు రెండుసార్లు, భోజనానికి అరగంట ముందు ఒక కప్పు మోతాదులో తాగితే రక్తంలో షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ముఖ్యంగా టైప్-2 మధుమేహం ఉన్నవారికి నేరేడు ఆకులు ఎంతో ప్రయోజనకరం.

నేరేడు ఆకుల్లోని సమ్మేళనాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. విరేచనాల సమస్యతో బాధపడేవారు నేరేడు ఆకుల కషాయం తాగితే ఉపశమనం పొందవచ్చు. ఇది కాలేయ పనితీరును మెరుగుపరచడంతో పాటు కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

జ్వరం నుంచి ఉపశమనం కోసం కూడా నేరేడు ఆకులు ఉపయోగపడతాయి. నేరేడు ఆకుల రసంలో ధనియాలు కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. అధిక బరువుతో బాధపడేవారికి కూడా ఈ ఆకులు సహాయపడతాయి.

నేరేడు ఆకుల్లో యాంటీ-బ్యాక్టీరియల్ మరియు యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి నోటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ ఆకులను నేరుగా నమిలితే నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది, దుర్వాసన తగ్గుతుంది, మరియు దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఈ ఆకుల్లోని యాంటీ-ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి మరియు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ