Moringa Leaf Benefits: మునగ ఆకులు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
Moringa Leaf Benefits: మునగ ఆకులు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. మునగ చేసే ప్రయోజనాలు దాదాపు అందరికీ తెలిసినవే! చాలా మంది మునగ కాయలను ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. మునగ కాయలతో పప్పు, సాంబార్, కూరలు తయారు చేస్తుంటారు. మునగలోని ఔషధ గుణాలు, పోషక విలువల కారణంగా 300కు పైగా రోగాలను నివారించే శక్తి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అయితే, మునగ ఆకులు కూడా అంతే ఉపయోగకరమని మీకు తెలుసా? మునగ ఆకులను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను అరికట్టవచ్చని నిపుణులు అంటున్నారు. మునగ ఆకుల్లో విటమిన్ ఎ, బి, సి, అలాగే క్యాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకులను తరచూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
మునగ ఆకులను కూరల్లో చేర్చుకోవడం మరింత మేలు చేస్తుంది. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, దీనితో జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. కంటి చూపును మెరుగుపరచడానికి, కంటి సమస్యలను నివారించడానికి కూడా ఈ ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మునగ ఆకుల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాలు బలపడతాయి. రోజూ మునగ ఆకు తినడం ద్వారా ఎముకలు దృఢంగా మారుతాయి.
మునగ ఆకుల్లోని సమ్మేళనాలు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తాయి. పొటాషియం, క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది, రక్త ప్రసరణ మెరుగవుతుంది, కండరాల పనితీరు సమర్థవంతమవుతుంది. ఐరన్ అధికంగా ఉండటం వల్ల హీమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
రోజూ మునగ ఆకు తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. క్యాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. వారానికి కనీసం మూడు సార్లు మునగ ఆకు కూరను ఆహారంలో తీసుకోవడం సహజ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ ఆకుల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది, ఆకలి నియంత్రణలో ఉంటుంది, దీంతో బరువు తగ్గడం సులభమవుతుంది. అంతేకాదు, మునగ ఆకు వాడకం ద్వారా కొవ్వు కణాలు త్వరగా కరిగిపోతాయి.
మునగ ఆకులను ఏదో ఒక రూపంలో తరచూ తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు పోయి లివర్ డిటాక్స్ అవుతుంది, దీంతో లివర్ పనితీరు మెరుగుపడుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

