kitchen tips:వానాకాలంలో కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే..
kitchen tips:వానాకాలంలో కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే..వర్షాకాలం ఎండాకాలం తర్వాత వచ్చినప్పుడు చల్లగా, హాయిగా అనిపిస్తుంది. కానీ వర్షాలతో పాటు కొన్ని సమస్యలూ వస్తాయి. తేమ, ముసురు వల్ల కూరగాయలు, ఆహార పదార్థాలు త్వరగా చెడిపోయే అవకాశం ఉంది. అందుకే కూరగాయలు కొని నిల్వ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఉప్పు నీటితో కడగడం
వర్షాకాలంలో కూరగాయలపై క్రిములు, బాక్టీరియా ఎక్కువగా ఉంటాయి. కూరగాయలు కొన్నాక ఉప్పు కలిపిన నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత బాగా ఆరబెట్టి, ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే చాలా రోజులు చెడకుండా ఉంటాయి.
వేర్లు తొలగించడం
ఆకుకూరలు వర్షాకాలంలో త్వరగా చెడిపోతాయి. అందుకే వాటి వేర్లను తొలగించి, మట్టి, మురికి లేకుండా నీటితో శుభ్రం చేయాలి. కడిగిన తర్వాత ఆరబెట్టి, పేపర్ టవల్‌లో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచితే మంచిది.
గాలి ఆడేలా చూడటం
క్యారెట్, ముల్లంగి వంటి కూరగాయలను ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేసేటప్పుడు, సంచిలో చిన్న రంధ్రాలు చేయాలి. ఇలా చేస్తే గాలి ఆడుతుంది, తేమ పట్టకుండా కూరగాయలు చెడిపోకుండా ఉంటాయి.
సహజ పద్ధతుల వాడకం
వెల్లుల్లి, వేపాకు, కరివేపాకు వంటివి కూరగాయలు చెడిపోకుండా కాపాడతాయి. వీటిలో యాంటీ-బాక్టీరియల్, యాంటీ-ఫంగల్ గుణాలు ఉండటం వల్ల బాక్టీరియా, ఫంగస్ పెరగకుండా నిరోధిస్తాయి.
గాలి చొరబడని డబ్బాలు
కూరగాయలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచాలంటే, గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయడం ఉత్తమం. వర్షాకాలంలో గాలిలోని తేమ వల్ల కూరగాయలు త్వరగా చెడిపోతాయి. ఎయిర్‌టైట్ కంటైనర్లలో ఉంచితే అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

