Kitchenvantalu

Egg Manchurian:ఇంటిలో ఉండే వాటితో రెస్టారెంట్ స్టైల్‌లో ఎగ్ మంచూరియా.. తింటే అసలు వదిలిపెట్టరు..

Egg Manchurian:మంచూరియా చైనా నుంచి భారత్‌లోకి వచ్చి, మన రుచులకు అనుగుణంగా వివిధ రూపాల్లో మార్పు చెందింది. వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా, క్యాబేజీ మంచూరియా, ఎగ్ మంచూరియా వంటి రకరకాల వంటకాలు ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందాయి.

మంచూరియాని ఇష్టపడని వారు చాలా అరుదు. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే, వేడి వేడిగా ప్లేట్‌లో సర్వ్ చేస్తే, కొద్ది నిమిషాల్లోనే తినేస్తారు. ఈ రోజు రెస్టారెంట్ స్టైల్‌లో ఎగ్ మంచూరియా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:
– కోడిగుడ్లు
– కార్న్ ఫ్లోర్
– మైదా
– పచ్చిమిర్చి ముక్కలు
– అల్లం, వెల్లుల్లి (చిన్న ముక్కలుగా తరిగినవి)
– మిరియాల పొడి
– ఉల్లిపాయ ముక్కలు
– వైట్ పెప్పర్ పౌడర్
– చైనీస్ చిల్లీ పేస్ట్
– చక్కెర
– అజినోమోటో
– సోయా సాస్
– టమాటో సాస్
– వెనిగర్
– నీరు
– స్ప్రింగ్ ఆనియన్స్ (ఉల్లికాడలు)
– ఉప్పు
– అల్లం వెల్లుల్లి పేస్ట్

తయారీ విధానం:
ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టి, పెంకులు తీసేసి, నిలువుగా నాలుగు భాగాలుగా కట్ చేయాలి. ఒక గిన్నెలో ఒక కోడిగుడ్డు కొట్టి, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దిగా మైదా, కార్న్ ఫ్లోర్ వేసి మెత్తగా మిక్స్ చేయాలి.

గ్యాస్ స్టవ్‌పై బాణలి పెట్టి, నూనె వేసి వేడి చేయాలి. తయారు చేసిన మిశ్రమంలో కట్ చేసిన గుడ్డు ముక్కలను అద్ది, వేడి నూనెలో వేసి క్రిస్పీగా వేయించాలి. వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి.

స్టవ్‌పై మరో పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. తర్వాత చైనీస్ చిల్లీ పేస్ట్, చక్కెర, టమాటో కెచప్, మిరియాల పొడి, అజినోమోటో , వైట్ పెప్పర్ పౌడర్, ఉప్పు, వెనిగర్ వేసి బాగా కలపాలి.

ఇప్పుడు సోయా సాస్, టమాటో సాస్ వేసి, కావాల్సినంత నీరు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన గుడ్డు ముక్కలను వేసి బాగా కలపాలి. చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ (ఉల్లికాడలు) వేసి మిక్స్ చేయాలి.

రుచికరమైన ఎగ్ మంచూరియా రెడీ! దీన్ని అలాగే తినవచ్చు లేదా టమాటో కెచప్ లేదా చిల్లీ సాస్‌తో సర్వ్ చేసి ఆస్వాదించవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."