oats Benefits:ప్రతి రోజు ఓట్స్ తింటే అలవాటు ఉందా.. అధికంగా తింటే ఈ సమస్యలు తప్పవు..
oats Benefits:ప్రతి రోజు ఓట్స్ తింటే అలవాటు ఉందా.. అధికంగా తింటే ఈ సమస్యలు తప్పవు.. ఓట్స్‌లో విటమిన్ బి2, విటమిన్ సి, పీచు పదార్థం, పిండి పదార్థాలు, మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి, కాబట్టి ఇది అత్యంత పోషకాహారంగా పరిగణించబడుతుంది. ఓట్స్ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఇవి కేవలం అల్పాహారంగా మాత్రమే కాకుండా వివిధ రకాలుగా తినవచ్చు. అయితే, రోజూ ఓట్స్ తినడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో ఓట్స్ తినే అలవాటు బాగా పెరిగింది. చాలామంది ప్రతిరోజూ ఓట్స్‌ను తమ ఆహారంలో భాగం చేస్తున్నారు. ఓట్స్ ఆరోగ్యానికి మంచివని పోషకాహార నిపుణులు కూడా సమర్థిస్తున్నారు. అయినప్పటికీ, ఏ ఆరోగ్యకర ఆహారమైనా అతిగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తవచ్చు.
ఓట్స్ అధికంగా తినడం వల్ల కొంతమందిలో కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఓట్స్‌లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది, ఇది కాల్షియం, ఇనుము, జింక్ వంటి ఖనిజాల శోషణను అడ్డుకోవచ్చు.
ఓట్స్ పోషకాహారం అయినప్పటికీ, ఇందులో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల, ప్రతిరోజూ ఓట్స్ తినడం బరువు పెరగడానికి దారితీయవచ్చు. అల్పాహారంగా రోజూ ఓట్స్‌పై ఆధారపడటం వల్ల అవసరమైన అన్ని పోషకాలు లభించకపోవచ్చు. రోజూ ఓట్స్ తీసుకోవడం వల్ల కొందరిలో అజీర్తి లేదా కడుపు సంబంధిత సమస్యలు తలెత్తవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాబట్టి, ప్రతిరోజూ ఓట్స్ తినడం ఆరోగ్యానికి పూర్తిగా మంచిది కాకపోవచ్చు. ఏ ఆహారమైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఓట్స్ వాడకంపై ఏవైనా సందేహాలు ఉంటే, ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

