LIC HFL Recruitment 2025: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో జాబ్స్.. ఆలస్యం చేయకండి..
LIC HFL Recruitment 2025: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో జాబ్స్.. ఆలస్యం చేయకండి.. ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? అయితే ఈ అవకాశాన్ని కోల్పోకండి! లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (HFL)లో 250 అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
LIC HFL అప్రెంటిస్‌షిప్ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
– వయస్సు పరిమితి: అభ్యర్థి వయస్సు కనీసం 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా 25 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
– ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు ముందుగా జూలై 3, 2025న నిర్వహించే ప్రవేశ పరీక్షలో పాల్గొనాలి. అర్హత సాధించినవారిని జూలై 8-9, 2025 తేదీల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలుస్తారు.
– ఆఫర్ లెటర్స్: ఎంపికైన అభ్యర్థులకు జూలై 10-11, 2025న ఆఫర్ లెటర్లు జారీ చేస్తారు.
– అప్రెంటిస్‌షిప్ వ్యవధి: 12 నెలలు, ఈ కాలంలో నెలకు రూ. 12,000 స్టైఫండ్ అందిస్తారు.
– దరఖాస్తు ఫీజు:
– జనరల్/ఓబీసీ: రూ. 944
– ఎస్సీ/ఎస్టీ: రూ. 708
– పీడబ్ల్యూడీ: రూ. 472
– దరఖాస్తు గడువు: జూన్ 28, 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు.
పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
గమనిక ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

