Healthhealth tips in telugu

Weight Loss: వీటిలో ఏ ఒక్క డ్రింక్ తాగినా 30 రోజుల్లో బరువు తగ్గటం ఖాయం..

Weight Loss: వీటిలో ఏ ఒక్క డ్రింక్ తాగినా 30 రోజుల్లో బరువు తగ్గటం ఖాయం..బరువు ఎక్కువగా ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయని మనందరికీ తెలుసు. అందుకే చాలామంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నిపుణుల ప్రకారం, ఉదయాన్నే కొన్ని పానీయాల్లో ఏ ఒక్కటి తాగినా సన్నగా మారడం ఖాయమట. ఆ పానీయాలు ఏంటో తెలుసుకుందాం.

ఎవరైనా ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. కానీ, ఒత్తిడితో కూడిన జీవనశైలి, చెడు ఆహార అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల శరీరంలో కొవ్వు, ముఖ్యంగా పొట్ట చుట్టూ, పేరుకుపోతుంది. దీనివల్ల నచ్చిన దుస్తులు వేసుకోలేరు, ఎక్కువసేపు చురుగ్గా ఉండలేరు, ఏ పని చేసినా త్వరగా అలసట వస్తుంది.

ప్రస్తుతం అన్ని వయసుల వారూ అధిక బరువు, పొట్ట చుట్టూ కొవ్వు సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే కొవ్వు పేరుకుపోవడం అందాన్ని దెబ్బతీయడమే కాక, వృద్ధాప్య రూపాన్ని ఇస్తుంది. అంతేకాదు, ఇది ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది.

పొట్ట కొవ్వును తగ్గించేందుకు చాలామంది అనేక పద్ధతులు పాటిస్తారు. కొవ్వు పేరుకుపోయిన తర్వాత తగ్గించడం కంటే, అది రాకుండా నిరోధించడం ముఖ్యం. దీనికోసం జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలి. ఈ మార్పులు కొవ్వు పేరుకోకుండా నిరోధిస్తాయి, ఇప్పటికే ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.

30 రోజుల్లో కొవ్వును తగ్గించే కొన్ని పానీయాల గురించి తెలుసుకుందాం. వీటిలో ఏదో ఒకటి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే, ఒక నెలలో పొట్ట కొవ్వు తగ్గి, బరువు సులభంగా తగ్గుతారు.

1. చియా సీడ్స్ నీరు: బరువు తగ్గించడంలో ఇది అద్భుతమైన పానీయం. చియా గింజల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఒక గ్లాసు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ చియా గింజలు వేసి కొంతసేపు నానబెట్టి, కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా రోజూ ఉదయం తాగితే కడుపు నిండుగా ఉంటుంది, అనారోగ్యకర ఆహారాలపై ఆసక్తి తగ్గుతుంది.

2. అల్లం రసం: అల్లంలో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది జీవక్రియను పెంచి, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఒక పెద్ద అల్లం ముక్క, చిన్న పసుపు ముక్కను మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బి, వడకట్టాలి. దీనిలో 1/2 టీస్పూన్ మిరియాల పొడి, నిమ్మరసం, 1 టీస్పూన్ తేనె కలిపి, రాత్రి ఫ్రిజ్‌లో ఉంచి, మరుసటి రోజు ఉదయం తాగాలి.

3. గ్రీన్ టీ & నిమ్మరసం: గ్రీన్ టీలోని క్యాటెచిన్లు, నిమ్మరసంలోని విటమిన్ సి జీవక్రియను మెరుగుపరచి, కొవ్వును కరిగిస్తాయి. గ్రీన్ టీలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే విష పదార్థాలు తొలగిపోతాయి.

4. నిమ్మరసం & మిరియాల నీరు: ఒక గ్లాసు వెచ్చని నీటిలో నిమ్మరసం, కొద్దిగా మిరియాల పొడి కలిపి రోజూ తాగితే విష పదార్థాలు బయటకు వెళ్లి, జీవక్రియ మెరుగవుతుంది. ఇది కొవ్వు కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

ఈ పానీయాలతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం కూడా చేస్తే, 30 రోజుల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ