Black Water Benefits: బ్లాక్ వాటర్ లాభాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.. ఇది నిజం..
Black Water Benefits: బ్లాక్ వాటర్ లాభాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.. ఇది నిజం.. బ్లాక్ వాటర్.. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. అనేకమంది సెలబ్రిటీలు బ్లాక్ వాటర్ తాగుతూ, దాని బాటిల్‌ను క్యారీ చేస్తూ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆరోగ్య నిపుణులు ఈ నీటిలో కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఫుల్విక్ మినరల్స్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు. రోజూ ఈ నీరు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
బ్లాక్ వాటర్‌ను ఆల్కలీన్ వాటర్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన నీరు. సాధారణ నీటికి కృత్రిమ ఖనిజాలను కలపడం వల్ల ఇది నలుపు రంగులోకి మారుతుంది. దీని pH విలువ 8-9 మధ్య ఉంటుంది, ఇది ఆల్కలీన్‌గా పనిచేస్తుంది. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ నీరు తాగడం వల్ల దీనికి మరింత ప్రచారం లభించింది.
సాధారణ మంచినీటి pH స్థాయి 7 ఉంటే, బ్లాక్ వాటర్‌లో ఇది అంతకంటే ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా, ఫిట్‌గా ఉంచడంలో ఈ నీరు ఎంతగానో సహాయపడుతుంది. ఇందులోని 70% ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోజంతా ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి.
బ్లాక్ వాటర్ తాగడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, పేగు సమస్యలు తగ్గుతాయి. అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి ఇది ఎంతో ప్రయోజనకరం. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది, శరీరంలో కొవ్వు పేరుకోకుండా నిరోధిస్తుంది. ఈ నీరు తాగితే బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
ఈ నీరు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, పొడిబారకుండా చేస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. బ్లాక్ వాటర్ శరీరానికి డిటాక్స్ డ్రింక్‌గా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి, దీంతో వృద్ధాప్య ఛాయలు ఆలస్యంగా కనిపిస్తాయి.
మధుమేహం ఉన్నవారికి బ్లాక్ వాటర్ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, మధుమేహం వల్ల వచ్చే ఇతర సమస్యలను కూడా నివారిస్తాయి. అధ్యయనాల ప్రకారం, ఈ నీరు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, మానసిక స్థితిని సానుకూలంగా మారుస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

