Healthhealth tips in telugu

Remedies for Knee Pain: మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఇలా చేస్తే సరి

Remedies for Knee Pain: మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఇలా చేస్తే సరి వయసు పెరిగేకొద్దీ కీళ్లు అరిగి నొప్పులు సాధారణంగా వస్తాయి. అయితే, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఇప్పుడు చిన్న వయసులోనే కీళ్ల సమస్యలు తలెత్తుతున్నాయి. క్యాల్షియం, ప్రొటీన్ లోపం వల్ల మోకాళ్ల నొప్పులు రాగలవు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని ఆహార పదార్థాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని ఆహారంలో చేర్చుకుంటే ఆర్థరైటిస్ నివారణలో మంచి ఫలితాలు కనిపిస్తాయి.

వెల్లుల్లిలో కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మోకాళ్ల నొప్పులను సమర్థవంతంగా తగ్గిస్తాయి. తాజా అల్లం లేదా శొంఠి రూపంలో తీసుకున్నా నొప్పులు తగ్గుముఖం పడతాయి.

వాల్‌నట్స్, బాదం, అవిసె గింజలు, చియా, పైన్ గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కీళ్ల వాపును తగ్గించడంలో బాగా సహాయపడతాయి.

యాపిల్స్, ఆప్రికాట్, క్రాన్‌బెర్రీస్ వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, నొప్పులను తగ్గించడంలో తోడ్పడతాయి.

ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. బ్రకోలీ, కేల్, పాలకూర వంటి ఆకుకూరలు ఇన్ ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి, మోకాళ్ల నొప్పులను అదుపులో ఉంచుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ