Ashada masam 2025:2025 ఆషాడమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు.. ప్రత్యేకతలు..
Ashada masam 2025:2025 ఆషాడమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు.. ప్రత్యేకతలు.. ఆషాఢ మాసం (జూన్ 26 నుంచి జూలై 24 వరకు) హిందూ మతంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగిన మాసం.
ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును, శివుడిని పూజిస్తే ఐశ్వర్యం, సౌభాగ్యం లభిస్తాయని నమ్మకం. హిందూ క్యాలెండర్లో చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ మాసాల తర్వాత వచ్చే నాల్గవ మాసం ఆషాఢం. రుతుపవనాల ప్రారంభాన్ని సూచించే ఈ మాసం మతపరంగా కూడా చాలా విశిష్టమైనది. ఈ మాసంలో జరిగే పండుగలు, వ్రతాలు ఇలా ఉన్నాయి:
1. జూన్ 26 – బోనాలు (ఆషాఢ శుద్ధ పాడ్యమి):
తెలంగాణలో ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారంతో బోనాల సందడి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జూన్ 26 గురువారంతో ఆషాఢం మొదలవడంతో బోనాలు కూడా అదే రోజు ప్రారంభమవుతాయి. అంటువ్యాధుల నుంచి రక్షణ, ఆరోగ్యం కోసం అమ్మవారికి బోనం సమర్పిస్తారు.
2. జూన్ 26 – వారాహీ నవరాత్రులు (ఆషాఢ శుద్ధ పాడ్యమి):
ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు వారాహీ నవరాత్రులు జరుగుతాయి. ఈ సమయంలో భక్తులు శరన్నవరాత్రుల్లాగే దీక్షతో అమ్మవారిని పూజిస్తారు. ఉపవాసాలు, పూజలు చేస్తారు. వారాహీ అమ్మవారి పూజ వల్ల అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుందని నమ్మకం.
3. జూన్ 27 – పూరీ జగన్నాథ రథయాత్ర (ఆషాఢ శుద్ధ విదియ):
ఆషాఢ శుద్ధ విదియ రోజున పూరీలో జగన్నాథుడి రథయాత్ర వైభవంగా జరుగుతుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఈ రోజు గర్భగుడి నుంచి బయటకు వచ్చి భక్తుల మధ్య పది రోజుల పాటు ఉత్సవాల్లో పాల్గొంటారు.
4. జూలై 6 – తొలి ఏకాదశి:
ఆషాఢంలో వచ్చే ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతారని పురాణాలు చెబుతున్నాయి. ఇది దేవతలకు రాత్రి కాలం (దక్షిణాయనం) ప్రారంభమైనట్లు సూచిస్తుంది.
5. జూలై 10 – గురు పూర్ణిమ (వ్యాస పౌర్ణమి):
వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాలను అందించిన వేదవ్యాసుడిని ఆదిగురువుగా పూజిస్తారు. ఆయన జన్మతిథి అయిన ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ రోజు గురువులను స్మరించి, ఆశీస్సులు పొందుతారు.
6. జూలై 13 – సికింద్రాబాద్ మహంకాళి జాతర:
సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో జూలై 13న బోనాల సమర్పణ, జూలై 14న రంగం (భవిష్యవాణి) మరియు అమ్మవారి అంబారి ఊరేగింపు జరుగుతాయి. ఈ రెండు రోజులూ లక్షలాది భక్తులు తరలివస్తారు.
7. జూలై 17 – కర్కాటక సంక్రాంతి:
సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించే రోజుని కర్కాటక సంక్రాంతి అంటారు. ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది.
8. జూలై 20 – లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు:
హైదరాబాద్లోని లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. వర్షాకాలంలో అంటువ్యాధుల నుంచి రక్షణ కోసం ఈ ఆచారం జరుగుతుంది.
9. జూలై 24 – చుక్కల అమావాస్య:
ఆషాఢ మాసం ఈ రోజుతో ముగుస్తుంది. ఈ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. వివాహిత మహిళలు దీపస్తంభ వ్రతం ఆచరించి, శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారు. సంతానం, సౌభాగ్యం కోసం ఈ వ్రతం నోచుకుంటారు.
ఆషాఢ మాసంలో పూజలు, దానధర్మాలు:
– ప్రతి రోజు తెల్లవారుజామున స్నానం చేసి, సూర్యునికి అర్ఘ్యం సమర్పించి, పూజలు చేస్తే రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
– శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ఎర్రటి పూలు, తామర పూలు సమర్పిస్తే విశేష పుణ్యఫలం లభిస్తుంది.
– దానధర్మాలు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం, మంచి ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు.
ఆషాఢ మాసం విశిష్టతను గుర్తించి, భక్తిశ్రద్ధలతో పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల ఐశ్వర్యం, సౌభాగ్యం లభిస్తాయని నమ్మకం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

