Kitchenvantalu

Sorakaya Appalu:అప్పటికప్పుడు స్నాక్స్ చేయాలంటే “సొరకాయ అప్పాలు” ఇలా చేయండి.. కమ్మగా భలే ఉంటాయి…

Sorakaya Appalu:సొరకాయ అంటేనే కొందరు ముఖం చిదిమేస్తారు. సొరకాయ కూర అని వినగానే కొంతమంది ఆ రోజు ఇంట్లో భోజనం కూడా మానేస్తారు. కానీ, వాస్తవానికి సొరకాయతో చేసే వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయినప్పటికీ, సొరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఒక ప్రత్యేక వంటకం విషయంలో ఆసక్తిగా తింటారు –

అదే సొరకాయ అప్పాలు, లేదా సొరకాయ గారెలు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ వంటకం నోట్లో వేసుకుంటే ఒకటి రెండుతో ఆగకుండా తినేస్తారు. ఎన్ని తిన్నా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తాయి. ఇంట్లో వీటిని మళ్లీ చేయమని బతిమాలడం ఖాయం! ఇంత రుచికరమైన సొరకాయ అప్పాలు ఇంట్లో తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి.

సొరకాయ అప్పాలు తయారీకి కావలసిన పదార్థాలు:
– 400 గ్రాముల లేత సొరకాయ తరుగు
– ఉప్పు
– కరివేపాకు
– కొత్తిమీర
– పచ్చిమిర్చి
– బియ్యం పిండి
– నువ్వులు
– నానబెట్టిన పెసరపప్పు
– నానబెట్టిన పచ్చి శనగపప్పు
– జీలకర్ర
– ఉల్లిపాయ తరుగు
– నూనె

సొరకాయ అప్పాలు తయారీ విధానం:
1. ముందుగా లేత సొరకాయను శుభ్రంగా కడిగి, తురిమి పక్కన పెట్టుకోండి.
2. మిక్సీ జార్‌లో 10 పచ్చిమిర్చి, అర టీస్పూన్ ఉప్పు వేసి, నీళ్లు జోడించకుండా మెత్తగా గ్రైండ్ చేయండి.
3. ఇప్పుడు సొరకాయ తురుమును ఒక గిన్నెలోకి తీసుకుని, దానిలో పచ్చిమిర్చి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర, అర కప్పు సన్నగా తరిగిన కరివేపాకు, పావు కప్పు నువ్వులు, గంటసేపు నానబెట్టిన పావు కప్పు పెసరపప్పు, గంటసేపు నానబెట్టిన పావు కప్పు పచ్చి శనగపప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
4. ఈ మిశ్రమంలో 3 కప్పుల బియ్యం పిండి (సొరకాయ తరుము ఎన్ని కప్పులైతే అన్ని కప్పుల బియ్యం పిండి) వేసి, కొద్ది కొద్దిగా నీళ్లు జోడిస్తూ కలపండి. పిండి చాలా గట్టిగా లేదా చాలా పలుచగా ఉండకూడదు.
5. ఈ పిండిని ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోండి.
6. స్టవ్ మీద బాండీ పెట్టి, నూనె వేడి చేయండి. పిండి ముద్దలను కొద్దిగా మందంగా గారెల ఆకారంలో వత్తి, వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.
7. అంతే, సొరకాయ అప్పాలు సిద్ధం! ఇవి చల్లారిన తర్వాత తిన్నా అద్భుతమైన రుచిని ఇస్తాయి.