Sorakaya Chapati:రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే తేలికైన “సొరకాయ చపాతీ”లు.. టేస్ట్ సూపర్..
Sorakaya Chapati:రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే తేలికైన “సొరకాయ చపాతీ”లు.. టేస్ట్ సూపర్.. సొరకాయ మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. సాధారణంగా సొరకాయతో పులుసు, ఫ్రై, గారెలు వంటి వంటకాలు తయారుచేస్తుంటారు.
కానీ, సొరకాయతో చపాతీలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇవి రుచిలో అద్భుతంగా ఉండడమే కాక, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. గంటల తర్వాత తిన్నా, నోట్లో మెత్తగా కరిగిపోతాయి. ఇంట్లోనే దూది కంటే మెత్తగా, సులభంగా సొరకాయ చపాతీలు ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకోండి.
సొరకాయ చపాతీ తయారీకి కావాల్సిన పదార్థాలు:
– సొరకాయ
– గోధుమ పిండి
– జీలకర్ర
– కొత్తిమీర
– కరివేపాకు
– ఉప్పు
– గరం మసాలా
– ఇంగువ
– మిరియాల పొడి
– నూనె
తయారీ విధానం:
1. ఒక గిన్నెలో 2.5 కప్పుల గోధుమ పిండి వేయండి. అందులో కొద్దిగా ఉప్పు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 కట్ట తరిగిన కొత్తిమీర, 1 తరిగిన పచ్చిమిర్చి, అర టీస్పూన్ గరం మసాలా, రెండు చిటికెల ఇంగువ, ముప్పావు టీస్పూన్ మిరియాల పొడి వేసి, నీరు జోడించకుండా మెత్తగా కలుపుకోండి.
2. తర్వాత అందులో 2 కప్పుల సొరకాయ తురుము, తరిగిన కరివేపాకు రెమ్మ వేసి బాగా పిండుతూ కలపండి.
3. కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుతూ, పిండిని మెత్తగా (సెమీ సాఫ్ట్) కలుపుకోండి.
4. ఇందులో 2 టీస్పూన్ల నూనె వేసి, పిండిని బాగా మెదిపి, కనీసం 15 నిమిషాలు పక్కన ఉంచండి.
5. తర్వాత నిమ్మకాయ సైజు ముద్దలు తీసుకొని, పొడి పిండి చల్లుతూ నెమ్మదిగా చపాతీలుగా చేసుకోండి.
6. పాన్‌పై వేసి, రెండు వైపులా కాల్చండి. కాలిన వైపున కొద్దిగా నూనె రాస్తూ, బాగా కాల్చుకోండి.
అంతే, సొరకాయ చపాతీలు రెడీ! ఇవి సైడ్ డిష్ లేకుండానే, కేవలం పెరుగుతో తింటే అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు.

