Healthhealth tips in telugu

Varicose Veins: కాళ్లపై ఇలాంటి చారలు కనిపిస్తున్నాయా.. నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో..

Varicose Veins: ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో వెరికోస్ వెయిన్స్ ఒకటి. ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు ఏమిటి? దీని నుంచి ఎలా బయటపడాలి? ఇప్పుడు ఈ విషయాల గురించి తెలుసుకుందాం.

లక్షణాలు:
వెరికోస్ వెయిన్స్ అంటే సిరలు ఉబ్బడం. ఇవి సాధారణంగా కాళ్లలో లేదా చేతులలో కనిపిస్తాయి. నరాలు పైకి తేలినట్లు, ఉబ్బినట్లు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో నరాలు మెలితిరిగి, పెద్దవిగా కనిపిస్తాయి. మొదటి దశలో నొప్పి ఉండకపోవచ్చు, కానీ రెండవ దశలో నొప్పి, దురద, కాళ్లలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది.

ఎందుకు వస్తాయి?
వెరికోస్ వెయిన్స్ సిరలలోని వాల్వ్‌ల సమస్య వల్ల వస్తాయి. ఇవి వంశపారంపర్యంగా రావచ్చు. అధిక బరువు, గర్భం, ఎక్కువ సేపు నిలబడడం లేదా కూర్చోవడం వంటి కారణాల వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది.

జాగ్రత్తలు:
వెరికోస్ వెయిన్స్ సమస్య తొలి దశలోనే గుర్తిస్తే, వెంటనే వ్యాయామం ప్రారంభించాలి. రోజూ ఉదయం, సాయంత్రం 30 నిమిషాల పాటు నడవడం మంచిది.
కంప్రెషన్ స్టాకింగ్స్ ధరించడం ద్వారా సిరలపై ఒత్తిడి తగ్గించవచ్చు.
సమస్య తగ్గకపోతే లేదా నొప్పి పెరిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

చేయకూడనివి:
ఎక్కువ సేపు నిలబడడం లేదా కూర్చోవడం మానేయాలి.
శరీర బరువును నియంత్రణలో ఉంచాలి.
వైద్యుల సలహాతో కాళ్లకు సంబంధించిన నిర్దిష్ట వ్యాయామాలు చేయడం ద్వారా సమస్య పెరగకుండా నివారించవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ