Pesara Laddu:పిల్లలు కోసం “పెసర లడ్డూలు” ఇలా చేసి చూడండి.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం..
Pesara Laddu:పిల్లలు కోసం “పెసర లడ్డూలు” ఇలా చేసి చూడండి.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. రోజుకి ఒక లడ్డు పిల్లల నుంచి పెద్దవారి వరకు తింటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
కావలసిన పదార్థాలు:
½ కప్పు – బెల్లం తురుము
1 కప్పు – పెసలు
10 – బాదం
10 – జీడిపప్పు
10 – కిస్మిస్
1 టీస్పూన్ – యాలకుల పొడి
3 టేబుల్ స్పూన్లు – నెయ్యి
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు పెసలు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి, నీళ్లు పోసి పక్కన పెట్టండి.
స్టవ్‌పై కడాయి పెట్టి, నీళ్లు లేని పెసలను వేసి, మీడియం మంటపై క్రిస్పీగా, పొడిపొడిగా అయ్యే వరకు కలుపుతూ వేయించండి.
పెసలు రంగు మారిన తర్వాత వాటిని ఒక ప్లేట్‌లోకి తీసి చల్లారనివ్వండి. చల్లారిన పెసలను మిక్సీలో మెత్తగా పొడి చేయండి.
అదే కడాయిలో ½ కప్పు బెల్లం తురుము, ¼ కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు ఉడికించండి. కరిగిన బెల్లం ద్రావణాన్ని స్ట్రెయినర్‌తో వడకట్టండి.
మరో పాన్‌లో వడకట్టిన బెల్లం ద్రావణాన్ని పోసి 2 నిమిషాలు మరిగించి, పాకం పట్టకుండా పక్కన పెట్టండి.
వేరే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక, ముందుగా కట్ చేసిన బాదం, జీడిపప్పు వేసి దోరగా వేయించండి. తర్వాత కిస్మిస్ వేసి వేయించి, ఒక ప్లేట్‌లోకి తీసుకోండి.
అదే పాన్‌లో పెసరపప్పు పొడి వేసి, లో ఫ్లేమ్‌లో 2-3 నిమిషాలు సువాసన వచ్చే వరకు వేయించి, స్టవ్ ఆఫ్ చేయండి.
ఈ పొడిలో యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, బెల్లం ద్రావణం వేసి బాగా కలపండి.
మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చిన్న చిన్న లడ్డూలుగా చుట్టండి.
అంతే! రుచికరమైన, ఆరోగ్యకరమైన పెసరపప్పు లడ్డూలు సిద్ధం! ఈ లడ్డూలు వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి. పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ హెల్దీ లడ్డూలను ఒకసారి తయారు చేసి చూడండి..

