Kitchenvantalu

Tomato Paratha:దూది కంటే మెత్తని “టమాటో పరాటా”.. తింటే అసలు వదిలిపెట్టరు

Tomato Paratha:ఉత్తర భారతదేశంలో పరాటాలకు ఎంతో గిరాకీ ఉంది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా పరాటా ప్రేమికుల సంఖ్య పెరిగిపోతోంది. ఎప్పుడూ ఒకే రకం పరాటాలు తినడం విసుగు తెప్పిస్తుంది కదా?

ఆరోగ్యకరమైన టమాటా పరాటాను ఒకసారి ప్రయత్నించండి. దీనికి ఎక్కువ నూనె అవసరం లేదు, కాబట్టి ఆరోగ్యం రెట్టింపు లాభం! టమాటా పరాటా తయారీకి కావలసిన పదార్థాలు, రెసిపీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

టమాటా పరాటాకు కావలసిన పదార్థాలు
టమోటోలు – 2
గోధుమ పిండి – 1½ కప్పు
పచ్చిమిర్చి – 2
అల్లం – చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు – 5
సోంపు – ½ టీస్పూన్
వాము – ¼ టీస్పూన్
కొత్తిమీర తరుగు – 2 టీస్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్లు – అవసరమైనంత
నెయ్యి – 2 టీస్పూన్లు

టమాటా పరాటా తయారీ విధానం
టమోటోలను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేయండి.అందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, సోంపు వేసి మెత్తగా రుబ్బండి.నీళ్లు అవసరం లేదు, టమోటోల తడి సరిపోతుంది.ఈ టమాటా పేస్టును ఒక గిన్నెలోకి తీసుకోండి.

అందులో కొత్తిమీర, ఉప్పు, చిటికెడు వాము వేసి బాగా కలపండి.ఈ మిశ్రమంలో 1½ కప్పు గోధుమ పిండి వేసి, 1 టీస్పూన్ నూనె జోడించి కలపండి. ఆవసరమైతే కొద్దిగా నీళ్లు చేర్చి, చపాతీ పిండిలా కలుపుకోండి.పిండిని తడి గుడ్డతో కప్పి 10 నిమిషాలు నాననివ్వండి.

పెనం వేడి చేసి, పిండి నుండి ముద్ద తీసి పరాటాలా వత్తండి.రెండు వైపులా కాల్చి, కొద్దిగా నెయ్యి రాసి ఒత్తండి.రుచికరమైన, మెత్తని టమాటా పరాటాలు సిద్ధం!
ఈ పరాటాలను కర్రీ లేకుండానే తినవచ్చు, రుచి అద్భుతంగా ఉంటుంది. పెరుగుతో తింటే ఇంకా రుచిగా ఉంటుంది. కావాలంటే చికెన్ గ్రేవీ లేదా ఎగ్ కీమాతో కూడా ఆస్వాదించవచ్చు.

ఏ విధంగా తిన్నా, ఈ టమాటా పరాటా రుచికి మీరు ఫిదా అయిపోతారు! ఇంకెందుకు ఆలస్యం? ఈ రెసిపీ ప్రకారం టమాటా పరాటా చేసి ఆనందించండి!