BusinessToday gold rate

Gold Rate Today: జూలై 19వ తేదీ, శనివారం బంగారం ధర ఎలా ఉందో ఒక లుక్ వేయండి..

Gold Rate Today: జూలై 19వ తేదీ, శనివారం బంగారం ధర ఎలా ఉందో ఒక లుక్ వేయండి.. బంగారం ధరలు భారీగా పెరిగాయి. జూలై 19, 2025, శనివారం నాడు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,280, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,500గా ఉంది. ఒక కిలో వెండి ధర రూ. 1,25,000గా పలికింది. బంగారం ధరలు ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరువలో ఉన్నాయి, దీంతో ఆభరణాల కొనుగోలుదారులు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు. గత వారం రోజులుగా బంగారం ధరలు రికార్డు స్థాయిల వైపు దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం ఒక కీలక కారణం. ప్రస్తుతం అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర 3,350 డాలర్లుగా ఉంది, ఇది ఆల్-టైమ్ రికార్డుకు సమీపంలో ఉంది.

దీంతో భారత రిటైల్ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. మన దేశంలో బంగారం ధర లక్ష రూపాయలను దాటి ముందుకు సాగుతోంది. డాలర్ విలువ తగ్గడం బంగారం ధరల పెరుగుదలకు మరో ముఖ్య కారణం. డాలర్ విలువ పడిపోవడంతో బంగారానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అదే సమయంలో, స్టాక్ మార్కెట్‌లో నష్టాలు ఎదురవడంతో, పెట్టుబడిదారులు తమ నిధులను స్టాక్ మార్కెట్ నుంచి ఉపసంహరించి బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. ఫలితంగా, బంగారానికి డిమాండ్ భారీగా పెరిగి, ధరలు రికార్డు స్థాయికి చేరాయి.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఆల్-టైమ్ గరిష్ట స్థాయిని తాకాయి. వెండి ధర తొలిసారిగా రూ. 1.25 లక్షలను దాటింది, దీంతో వెండి అత్యంత విలువైన లోహంగా ముందుకు సాగుతోంది. గత సంవత్సరంతో పోల్చితే వెండి ధర సుమారు 40% పెరిగింది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ