Dry fruit milkshake:డ్రైఫ్రూట్స్ మిల్క్ షేక్ ఎన్నీ లాభాలో తెలుసా.. ఇంట్లోనే ఇలా సులభంగా చేసేయండి..
Dry fruit milkshake:డ్రైఫ్రూట్స్ మిల్క్ షేక్ ఎన్నీ లాభాలో తెలుసా.. ఇంట్లోనే ఇలా సులభంగా చేసేయండి.. చాలామంది శక్తి కోసం మిల్క్‌షేక్ తాగుతుంటారు. ఇది అందరికీ ఇష్టమైన పానీయం. మార్కెట్‌లో రకరకాల రుచుల్లో ఈ మిల్క్‌షేక్ లభిస్తుంది. అయితే, ఇంట్లో స్వయంగా తయారు చేసుకుని తాగితే ఆ రుచి, ఆనందం వేరేలా ఉంటాయి. అందుకే ఈ రోజు ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ మిల్క్‌షేక్ తయారీ విధానాన్ని తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
పాలు: 1 లీటరు
పంచదార: తీపికి సరిపడా
బాదం పప్పు: ¼ కప్పు
జీడిపప్పు: ¼ కప్పు
పిస్తా: ¼ కప్పు
కుంకుమ పువ్వు: 2 రేకులు
సోంపు: 2 టీస్పూన్లు
యాలకుల పొడి: 1 టీస్పూన్
దాల్చిన చెక్క పొడి: చిటికెడు
గసగసాలు: 2 టీస్పూన్లు
మిరియాలు: 5-6
తయారీ విధానం:
ముందుగా బాదం పప్పును నీటిలో నానబెట్టి, కొంత సమయం తర్వాత పొట్టు తీసి శుభ్రం చేయాలి.మిక్సీ జార్‌లో బాదం, జీడిపప్పు, పిస్తా, సోంపు, గసగసాలు, మిరియాలు వేసి, కొద్దిగా పాలు పోసి మెత్తగా పేస్ట్‌లా చేయాలి.
గ్యాస్ స్టవ్‌పై ఒక గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. అనంతరం పంచదార, కుంకుమ పువ్వు వేసి కలపాలి.పంచదార కరిగిన తర్వాత, ముందుగా తయారు చేసిన డ్రై ఫ్రూట్స్ పేస్ట్‌ను మరుగుతున్న పాలలో వేసి, అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.
పాలు చిక్కబడిన తర్వాత, యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలిపి, స్టవ్ ఆపేసి మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి తీసి చల్లారబెట్టాలి.చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి.
పూర్తిగా చల్లబడిన తర్వాత, ఈ మిల్క్‌ను గ్లాసులో పోసి, పైన డ్రై ఫ్రూట్స్‌తో అలంకరిస్తే, రుచికరమైన డ్రై ఫ్రూట్స్ మిల్క్‌షేక్ సిద్ధం..ఈ చల్లని, రుచికరమైన మిల్క్‌షేక్‌ను ఇంట్లో పిల్లలు, పెద్దలు, అతిథులు అందరూ ఆస్వాదిస్తారు. ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్‌షేక్ రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.

