Kadai Mushroom Masala:రైస్ రోటి బిర్యానీ లోకి అదిరిపోయే కమ్మనైన “కడై మష్రూమ్ మసాలా”..
Kadai Mushroom Masala:రైస్ రోటి బిర్యానీ లోకి అదిరిపోయే కమ్మనైన “కడై మష్రూమ్ మసాలా”.. చాలా మంది పుట్టగొడుగులను ఇష్టపడతారు. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పొలాల గట్ల వద్ద పుట్టగొడుగులు సమృద్ధిగా లభిస్తాయి. అయితే, ప్రస్తుతం వీటిని అనేకమంది పెంచుతుండటంతో ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ పుట్టగొడుగులు అందుబాటులో ఉన్నాయి.
ఈ పుట్టగొడుగులతో కడై మష్రూమ్ మసాలా కూర తయారు చేసి చపాతీలతో తింటే అద్భుతమైన రుచి వస్తుంది. అంతేకాక, పుట్టగొడుగుల ద్వారా పోషకాలు కూడా లభిస్తాయి. ఈ కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కడై మష్రూమ్ మసాలా తయారీకి కావలసిన పదార్థాలు:
పుట్టగొడుగులు – 200 గ్రాములు
క్యాప్సికమ్ ముక్కలు – 1 కప్పు
టమాటా ముక్కలు – 2½ కప్పులు
ఉల్లిపాయ ముక్కలు – 1 కప్పు
వెల్లుల్లి ముద్ద – 1 టేబుల్ స్పూన్
గరం మసాలా పొడి – 1 టీస్పూన్
కసూరి మేథీ – 1 టీస్పూన్
మీగడ – 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర తురుము – కొద్దిగా
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి – 4
నూనె – 2 టేబుల్ స్పూన్లు
కడై మష్రూమ్ మసాలా తయారీ విధానం:
బాణలిలో ధనియాలు, ఎండుమిర్చిని వేయించి, చల్లారిన తర్వాత పొడి చేయాలి.నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేసి కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత వెల్లుల్లి ముద్ద వేసి, బాగా వేగాక ధనియాలు, ఎండుమిర్చి పొడి వేసి ఒక నిమిషం వేయించాలి.
ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి.టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, పుట్టగొడుగుల ముక్కలు వేసి ఉడికించాలి.
పుట్టగొడుగుల్లోని నీరు పూర్తిగా ఆవిరై, అవి బాగా ఉడికిన తర్వాత గరం మసాలా, కసూరి మేథీ వేసి బాగా కలపాలి.చివరగా కొత్తిమీర తురుము, మీగడ వేసి దించాలి.
ఇలా తయారైన రుచికరమైన కడై మష్రూమ్ మసాలాను చపాతీలతో సర్వ్ చేస్తే అద్భుతమైన రుచి వస్తుంది.

