Healthhealth tips in telugu

Walnuts:రోజుకి 2 వాల్ నట్స్ తింటే.. ముఖ్యంగా ఆ సమస్యలకు చెక్..

Walnuts:రోజుకి 2 వాల్ నట్స్ తింటే.. ముఖ్యంగా ఆ సమస్యలకు చెక్.. వాల్‌నట్స్‌ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. నిత్యం వాల్‌నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చని పరిశోధకులు తెలిపారు. సుమారు 600 మందికి పైగా పాల్గొన్న ఓ అధ్యయనంలో ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వాల్‌నట్స్‌ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వాల్‌నట్స్‌ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయని అందరికీ తెలిసిన విషయమే. ఆరోగ్య నిపుణులు కూడా వాల్‌నట్స్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని సిఫారసు చేస్తుంటారు. ఈ విషయాన్ని స్పెయిన్‌లోని బార్సిలోనా పరిశోధకులు తాజా అధ్యయనంతో మరోసారి రుజువు చేశారు. 628 మంది పాల్గొన్న ఈ పరిశోధనలో వారు ఈ నిర్ణయానికి వచ్చారు.

ప్రతిరోజూ అర కప్పు వాల్‌నట్స్‌ తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అధ్యయనంలో తేలింది. నిత్యం వాల్‌నట్స్‌ తినే వారిలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు 8.5 శాతం తగ్గినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ప్రకారం, వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ సమృద్ధిగా ఉంటాయి, ఇవి సాధారణంగా చేపలలో లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి, దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా నివారించవచ్చు.

వాల్‌నట్స్‌ గుండె ఆరోగ్యానికే కాకుండా మెదడు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వాల్‌నట్స్‌ తీసుకోవడం వల్ల పుట్టబోయే శిశువు మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ