Kitchenvantalu

Chinthapandu Pachadi:”చింతపండు పచ్చడి” ఇలా చేసి చూడండి వేడివేడి అన్నంలో నెయ్యి తో తింటే రుచి అదిరిపోతోంది

Chinthapandu Pachadi:”చింతపండు పచ్చడి” ఇలా చేసి చూడండి వేడివేడి అన్నంలో నెయ్యి తో తింటే రుచి అదిరిపోతోంది.. చింతపండు మన వంటింట్లో ఎక్కువగా రసం, చారు, సాంబార్, పులుసు కూరల తయారీలో ఉపయోగిస్తాం.

ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. చింతపండును ఆహారంలో తరచూ చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, బరువు తగ్గడానికి, షుగర్ వ్యాధిని నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే, జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలను తగ్గించడంలోనూ, గుండె మరియు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ చింతపండు ఉపయోగకరంగా ఉంటుంది.

చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు గాయాలు త్వరగా మానేలా చేయడంలో కూడా చింతపండు సహాయపడుతుంది. రసం, పులుసు కూరలతో పాటు, చింతపండుతో రుచికరమైన పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. చింతపండు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు మరియు తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

చింతపండు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు:
చింతపండు – 50 గ్రాములు
ఎండు మిరపకాయలు – 20 గ్రాములు
చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1
జీలకర్ర – 1 టీ స్పూన్
ధనియాలు – 1 టీ స్పూన్
శనగపప్పు – 1 టీ స్పూన్
మినప గుండు – 1 టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 6
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – 1 టేబుల్ స్పూన్

తాళింపు కోసం కావాల్సిన పదార్థాలు:
నూనె – 1 టేబుల్ స్పూన్
ఎండు మిర్చి – 2
జీలకర్ర – అర టీ స్పూన్
ఆవాలు – 1 టీ స్పూన్
శనగపప్పు – 1 టీ స్పూన్
కరివేపాకు – 1 రెబ్బ

చింతపండు పచ్చడి తయారీ విధానం:
చింతపండును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లలో నానబెట్టుకోవాలి.ఒక కళాయిలో నూనె వేసి, కాగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప గుండు వేసి వేయించాలి. వీటిని వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.

అదే కళాయిలో ఎండు మిరపకాయలను వేసి వేయించుకోవాలి.ఒక మిక్సీ జార్‌లో వేయించిన ఎండు మిరపకాయలు, ముందుగా వేయించిన ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప గుండు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.

అదే జార్‌లో వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టిన చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, తరిగిన ఉల్లిపాయ ముక్కలను కలపాలి.ఒక చిన్న కళాయిలో నూనె వేసి, కాగిన తర్వాత తాళింపు పదార్థాలను (ఎండు మిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు) వేసి తాళింపు చేయాలి.

ఈ తాళింపును గిన్నెలోని మిశ్రమంలో వేసి బాగా కలపాలి.ఇలా చేస్తే రుచికరమైన చింతపండు పచ్చడి సిద్ధమవుతుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు. పుల్లగా, రుచిగా తినాలనిపించినప్పుడు ఈ చింతపండు పచ్చడిని తయారు చేసుకోవచ్చు. చింతపండును ఆహారంలో తరచూ చేర్చుకోవడం వల్ల ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పులు కూడా తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.