Healthhealth tips in telugu

French Fries:టేస్టీగా ఉన్నాయని ఎక్కువగా తినేస్తున్నారా.. ఈ విషయం తెలియకపోతే ప్రమాదంలో పడినట్టే..

French Fries:టేస్టీగా ఉన్నాయని ఎక్కువగా తినేస్తున్నారా.. ఈ విషయం తెలియకపోతే ప్రమాదంలో పడినట్టే.. ఫ్రెంచ్ ఫ్రైస్‌ను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే, వారంలో ఒకసారి తినడం సమస్య కాకపోవచ్చు, కానీ వారానికి మూడు నాలుగు సార్లు తినడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకోవచ్చు.

ఇది మా మాట కాదు, ప్రఖ్యాత హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు చెబుతున్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్‌ను అధికంగా తినే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 20% ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

సుమారు 2,05,000 మంది ఆహార అలవాట్లను 30 సంవత్సరాల పాటు పరిశీలించిన అధ్యయనంలో ఈ విషయం నిర్ధారణ అయిందని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనంలో, 22,299 మంది డయాబెటిస్‌కు గురైనట్లు కనుగొన్నారు. వారి ఆహార అలవాట్లను విశ్లేషించగా, ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్లే డయాబెటిస్ వచ్చినట్లు తేలింది.

ఈ అధ్యయనం ద్వారా డయాబెటిస్ ప్రమాదాన్ని కనుగొన్న పరిశోధకులు, దీనికి పరిష్కారం కూడా సూచించారు. ఫ్రెంచ్ ఫ్రైస్‌కు బదులుగా తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా డయాబెటిస్ ప్రమాదాన్ని 19% వరకు తగ్గించవచ్చని తెలిపారు.

ఈ అధ్యయనాన్ని నిర్వహించిన ప్రొఫెసర్ వాల్టర్ విల్లెట్ మాట్లాడుతూ, రోజువారీ ఆహారంలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా డయాబెటిస్‌పై గణనీయమైన ప్రభావం చూపవచ్చని అన్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్ వినియోగాన్ని తగ్గించి, తృణధాన్యాలను తీసుకోవడం ద్వారా మధుమేహం ముప్పును తగ్గించవచ్చని సూచించారు. అయితే, ఉడికించిన లేదా బేక్ చేసిన బంగాళదుంపలను తినడం వల్ల డయాబెటిస్ ప్రమాదం ఉండదని పరిశోధకులు స్పష్టం చేశారు.

(గమనిక: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు మరియు నిపుణుల సలహాల ఆధారంగా మాత్రమే అందించబడ్డాయి. ఏవైనా సందేహాలు ఉంటే, ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."