Kitchenvantalu

Curry Leaves Chutney:అన్నంలోకి ఇలా 5 నిమిషాల్లో “కరివేపాకు పచ్చడి” చేస్తే నోటికి భలే ఉంటుంది …

Curry Leaves Chutney:అన్నంలోకి ఇలా 5 నిమిషాల్లో “కరివేపాకు పచ్చడి” చేస్తే నోటికి భలే ఉంటుంది … క‌రివేపాకు మ‌న రోజువారీ వంట‌ల్లో త‌ర‌చుగా ఉప‌యోగించే ప‌దార్థం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి.

కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, గాయాల‌ను త‌గ్గించ‌డంలో, బ‌రువు త‌గ్గించ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో, జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచ‌డంలో క‌రివేపాకు చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. అంతేకాకుండా, క‌రివేపాకుతో కారం పొడులు, రుచిక‌ర‌మైన ప‌చ్చ‌డి కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇప్పుడు క‌రివేపాకు ప‌చ్చ‌డి త‌యారీ విధానాన్ని తెలుసుకుందాం.

క‌రివేపాకు ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:
నూనె – 1 టీ స్పూన్
ధ‌నియాలు – 1 టీ స్పూన్
జీల‌క‌ర్ర – 1 టీ స్పూన్
మిన‌ప ప‌ప్పు – 3 టీ స్పూన్స్
ఎండు మిర్చి – 8
క‌రివేపాకు ఆకులు – 1 క‌ప్పు
బెల్లం తురుము – 2 టీ స్పూన్స్
చింత‌పండు – 1½ టీ స్పూన్
ఉప్పు – 1 టీ స్పూన్
నీళ్లు – ½ క‌ప్పు

తాళింపు కోసం కావ‌ల్సిన ప‌దార్థాలు:
నూనె – 1 టేబుల్ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
జీల‌క‌ర్ర – ½ టీ స్పూన్
ఇంగువ – ¼ టీ స్పూన్

క‌రివేపాకు ప‌చ్చ‌డి త‌యారీ విధానం:
ముందుగా ఒక క‌ళాయిలో 1 టీ స్పూన్ నూనె వేసి కాగిన త‌ర్వాత ధ‌నియాలు, జీల‌క‌ర్ర, మిన‌ప ప‌ప్పు, ఎండు మిర్చి, క‌రివేపాకు ఆకుల‌ను వేసి బాగా వేయించుకోవాలి. వేగిన త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకుని, బెల్లం తురుము, ఉప్పు, చింత‌పండు వేసి మెత్త‌గా గ్రైండ్ చేయాలి.
Curry Leaves Health benefits In telugu
త‌ర్వాత ½ క‌ప్పు నీళ్లు జోడించి మ‌రోసారి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.ఇప్పుడు మ‌రో క‌ళాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, తాళింపు ప‌దార్థాలైన ఆవాలు, జీల‌క‌ర్ర, ఇంగువ వేసి తాళింపు చేయాలి.తాళింపు సిద్ధ‌మైన త‌ర్వాత, మిక్సీలో గ్రైండ్ చేసిన ప‌చ్చ‌డి మిశ్ర‌మాన్ని జోడించి బాగా క‌ల‌పాలి.

ఈ మిశ్ర‌మాన్ని చిన్న మంట‌పై 5 నిమిషాల పాటు వేయించి, స్ట‌వ్ ఆఫ్ చేయాలి. ఇలా త‌యారైన క‌రివేపాకు ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీన్ని గాలి త‌గ‌ల‌కుండా ఒక డ‌బ్బాలో నిల్వ చేస్తే నెల రోజుల వ‌ర‌కు తాజాగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని అన్నం, నెయ్యితో క‌లిపి తింటే అద్భుత‌మైన రుచి వ‌స్తుంది. మొద‌టి ముద్ద‌గా ఈ ప‌చ్చ‌డిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్య‌ ప్ర‌యోజ‌నాలు కూడా పొంద‌వ‌చ్చు.