Kitchenvantalu

Houseflies:ఇంట్లో ఈగల బెడద తప్పట్లేదా.. ఇలా చేశారంటే ఈగలు మళ్లీ ఇంట్లోకి రావు..

Houseflies:ఇంట్లో ఈగల బెడద తప్పట్లేదా.. ఇలా చేశారంటే ఈగలు మళ్లీ ఇంట్లోకి రావు.. వానాకాలం వచ్చిందంటే ఈగల సమస్య ఎక్కువవుతుంది. ఇంట్లో అవి ముసురుకుని చిరాకు తెప్పిస్తాయి. కానీ, ఈగలను తరిమికొట్టడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
How to get rid of house flies
ఇప్పుడు చెప్పే సులభమైన చిట్కాలు పాటిస్తే ఈగల బెడద నుంచి సులువుగా బయటపడవచ్చు. ఈ చిట్కాలు ఇంట్లోనే దొరికే పదార్థాలతో సాధ్యమవుతాయి. ఈగలు మళ్లీ ఇంట్లోకి రాకుండా చేసే ఈ సింపుల్ టిప్స్ ఏంటో చూద్దాం.

1. యాపిల్ సైడర్ వెనిగర్ ట్రాప్
ఈగలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని డ్రైనేజీలపై వాలుతాయి, మరికొన్ని పండ్లు, ఆహార పదార్థాలపై తిరుగుతాయి. ఈ చిన్న ఈగలు ఎక్కువ సంఖ్యలో ఇంట్లోకి చేరతాయి. వీటిని తరిమికొట్టేందుకు ఒక సులభమైన చిట్కా ఉంది.

ఒక గిన్నెలో యాపిల్ సైడర్ వెనిగర్ పోసి, అందులో రెండు చుక్కల డిష్ వాష్ లిక్విడ్ కలపండి.ఆ గిన్నెపై ప్లాస్టిక్ కవర్ కప్పి, దానికి చిన్న చిన్న రంధ్రాలు చేయండి.ఈ గిన్నెను చెత్త బుట్ట లేదా పండ్లు ఉంచే ప్రదేశంలో పెట్టండి.ఈగలు రంధ్రాల ద్వారా లోపలికి వెళ్లి, అందులో చిక్కుకుని బయటకు రాలేవు. ఈ ట్రాప్ ఈగలను సమర్థవంతంగా బంధిస్తుంది.

2. బేకింగ్ సోడా మిశ్రమం
సింక్ లేదా బాత్‌రూమ్ డ్రైనేజీల వద్ద తిరిగే ఈగలను తొలగించడం కూడా సులభమే.అర కప్పు బేకింగ్ సోడాలో అర కప్పు వైట్ వెనిగర్ కలపండి.ఈ మిశ్రమాన్ని డ్రైనేజీలో పోసి కాసేపు అలాగే ఉంచండి.నురగ వస్తే, మిశ్రమం పని చేస్తోందని అర్థం. తర్వాత వేడి నీటిని డ్రైన్‌లో పోయండి.ఇలా చేయడం వల్ల ఈగలు చనిపోతాయి, మళ్లీ రాకుండా ఉంటాయి.

అలాగే, ఇంట్లో మొక్కలపై వాలే ఈగలను తొలగించేందుకు, మట్టి తడిగా లేనప్పుడు దాల్చిన చెక్క పొడి లేదా వేప నూనెను నీటిలో కలిపి ఆకులపై స్ప్రే చేయండి. ఇది ఈగల లార్వాను పూర్తిగా తొలగిస్తుంది.

3. నిమ్మతొక్కల స్ప్రే
నిమ్మతొక్కలను నీటిలో వేసి బాగా మరిగించండి.చల్లారిన తర్వాత, అందులో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె లేదా లవంగ నూనె కలపండి.ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి, సింక్, కిచెన్, చెత్త బుట్టల వద్ద స్ప్రే చేయండి.ఇది ఇంటికి మంచి సుగంధాన్ని ఇవ్వడమే కాక, ఈగలను దూరం చేస్తుంది.

4. కర్పూరం వాడకం
కర్పూరం వెలిగించి, ఈగలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో ఉంచండి.కర్పూరం యొక్క ఘాటైన వాసన ఈగలను త్వరగా పారిపోయేలా చేస్తుంది.ఈ చిట్కాను కిచెన్ లేదా బెడ్‌రూమ్‌లలో పాటించడం మంచిది.

5. తులసి ఆకుల స్ప్రే
తులసి ఆకులను నీటిలో వేసి మరిగించండి.చల్లారిన తర్వాత నీటిని వడకట్టి, స్ప్రే బాటిల్‌లో నింపండి.చెత్త బుట్టలు, కిటికీల వద్ద స్ప్రే చేయండి.ఇది ఈగలను దూరం చేయడంలో సహాయపడుతుంది.

6. పెప్పర్‌మింట్ స్ప్రే
ఒక కప్పు నీటిలో అర కప్పు వెనిగర్, 10 చుక్కల పెప్పర్‌మింట్ నూనె, ఒక టేబుల్ స్పూన్ డిష్ వాష్ లిక్విడ్ కలపండి.ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి, చెత్త బుట్టలు, డ్రైనేజీల వద్ద స్ప్రే చేయండి.ఇది ఈగలను సులభంగా తరిమికొడుతుంది.

7. రూమ్ డిఫ్యూజర్
రూమ్ డిఫ్యూజర్‌లో పెప్పర్‌మింట్, లావెండర్ లేదా యూకలిప్టస్ నూనె కలిపి వాడండి.ఈ ఘాటైన వాసన ఈగలను దూరం చేస్తుంది, అదే సమయంలో ఇంటికి సుగంధాన్ని అందిస్తుంది.

8. ఇతర జాగ్రత్తలు
ఇంట్లో కిటికీలకు మెష్‌లు అమర్చండి.
ఎల్లో లైట్స్ వాడితే ఈగలు త్వరగా బయటకు వెళ్తాయి.
ఏసీ నుంచి నీరు లీక్ అయ్యే ప్రదేశాలను శుభ్రంగా ఉంచండి.
బకెట్‌లలో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోండి, ఖాళీ చేసి పక్కన పెట్టండి.

ఈ సులభమైన చిట్కాలతో ఈగల బెడద నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇంట్లో స్వచ్ఛతను పాటిస్తూ, ఈ టిప్స్ అమలు చేస్తే ఈగలు మళ్లీ రాకుండా చూసుకోవచ్చు.