Kitchenvantalu

Palli Chutney:”పల్లీ చట్నీ”.. ఇడ్లీ దోశ లోకి ఎప్పుడూలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి

Palli Chutney:”పల్లీ చట్నీ”.. ఇడ్లీ దోశ లోకి ఎప్పుడూలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి.. ఉదయం టిఫిన్‌లో ఇడ్లీ, దోస, ఉత్తప్పం, ఉప్మా వంటి వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తాం. ప్రతి ఆహార పదార్థానికి వేర్వేరు చట్నీలను తయారు చేస్తాం. అయితే, ఈ అన్ని ఆహార పదార్థాలతో కలిపి తినడానికి ఒకే ఒక రుచికరమైన చట్నీని తయారు చేయవచ్చు. ఈ చట్నీ తయారీ విధానం మరియు దానికి కావాల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
peanuts side effects
పల్లి చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు:
పల్లీలు – ¾ కప్పు
ఎండు మిరపకాయలు – 6 లేదా 7
కరివేపాకు – 1 రెమ్మ
చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 (చిన్నది)
వెల్లుల్లి రెబ్బలు – 2
చింతపండు – కొద్దిగా
నూనె – ¼ టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్లు – తగినంత

తాళింపు కోసం కావాల్సిన పదార్థాలు:
నూనె – 1 టేబుల్ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – ¼ టీ స్పూన్
మినపప్పు – 1 టీ స్పూన్
కరివేపాకు – 1 రెమ్మ
ఎండు మిర్చి – 2

పల్లి చట్నీ తయారీ విధానం:
ముందుగా ఒక కళాయిలో ¼ టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలను వేసి మందమైన మంటపై వేయించాలి.పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి కలుపుతూ వేయించాలి.ఇవి బాగా వేగిన తర్వాత చింతపండు వేసి, స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం పూర్తిగా చల్లబడే వరకు ఉంచాలి.
cropped-garlic-side-effects.jpg
చల్లారిన తర్వాత, ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్‌లో వేసి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, తగినంత నీళ్లు జోడించి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.ఇప్పుడు ఒక చిన్న కళాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి తాళింపు చేయాలి.

ఈ తాళింపును మరియు తరిగిన ఉల్లిపాయలను రుబ్బిన చట్నీలో వేసి బాగా కలపాలి.ఇలా తయారు చేసిన పల్లి చట్నీ చాలా రుచికరంగా ఉంటుంది. ఈ చట్నీని ఉదయం టిఫిన్‌లో ఇడ్లీ, దోస, ఉత్తప్పం, ఉప్మా వంటి అన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తింటే అద్భుతమైన రుచిని అందిస్తుంది.