Potato Fry:”ఆలూ ఫ్రై” రంగు రుచి కరకరలాడుతూ పర్ఫెక్ట్ గా రావాలంటే ఇలా చేయాల్సిందే
Potato Fry:”ఆలూ ఫ్రై” రంగు రుచి కరకరలాడుతూ పర్ఫెక్ట్ గా రావాలంటే ఇలాచేయాల్సిందే.. బంగాళాదుంపలు మనం తరచూ ఆహారంలో ఉపయోగించే దుంప జాతి కూరగాయల్లో ఒకటి. ఇవి మన శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. బంగాళాదుంపల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, కాపర్, మెగ్నీషియం వంటి ఖనిజాలు మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో ఎంతో సహాయపడతాయి.

బంగాళాదుంపలు గుండె సంబంధిత సమస్యలైన హార్ట్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్‌లను నివారించడంతో పాటు కాలేయాన్ని శుద్ధి చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగాళాదుంపలను ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. బంగాళాదుంపలతో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తాం, ముఖ్యంగా ఆలూ ఫ్రై అత్యంత రుచికరమైన వంటకం. ఈ ఆలూ ఫ్రైని రుచిగా తయారు చేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు:
ఉడికించి ముక్కలుగా తరిగిన బంగాళాదుంపలు – 300 గ్రాములు
చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1
చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 5
కరివేపాకు – 1 రెబ్బ
పసుపు – 1/4 టీస్పూన్
కారం – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1/2 టేబుల్ స్పూన్
మిరియాలు – 15
గరం మసాలా – 1/2 టేబుల్ స్పూన్
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 10
శనగపప్పు – 1 టేబుల్ స్పూన్
మినపప్పు – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – 2 టేబుల్ స్పూన్లు
తరిగిన కొత్తిమీర – కొద్దిగా

ఆలూ ఫ్రై తయారీ విధానం:
ముందుగా ఒక కళాయిలో మినపప్పు, శనగపప్పు వేసి వేయించండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర, మిరియాలు వేసి వేయించండి.ఇవి పూర్తిగా వేగిన తర్వాత ఒక జార్‌లోకి తీసుకుని మెత్తని పొడిగా చేయండి.ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి, కాగిన తర్వాత తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించండి.
ఇవి వేగిన తర్వాత తరిగిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించండి.తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించండి.ఆ తర్వాత బంగాళాదుంప ముక్కలను వేసి, కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచండి.
ఇప్పుడు ముందుగా తయారు చేసిన పొడి, గరం మసాలా వేసి కలిపి, మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉంచండి.చివరగా కొత్తిమీర వేసి స్టవ్‌ను ఆపేయండి.ఈ విధంగా తయారు చేస్తే రుచికరమైన ఆలూ ఫ్రై సిద్ధమవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా లేదా దోసెతో సర్వ్ చేస్తే అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు.

