Kitchenvantalu

Today Recipes:మీల్ మేకర్ తో మంచురియా సింపుల్ గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో …

Meal maker manchurian:మీల్ మేకర్ తో వెరైటీ వంటకాలు ఒక్కసారి ట్రై చేసారంటే.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న సమయంలో, చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఏదైనా రుచికరమైన వంటకం తినాలనిపిస్తుంది. బయటి నుంచి తెచ్చుకునే బదులు, ఇంట్లోనే శుభ్రంగా, రుచిగా ఓ స్పైసీ వంటకం తయారు చేసుకోవచ్చు. మీ ఇంట్లో మీల్ మేకర్ ఉందా? అయితే, మీల్ మేకర్ మంచూరియన్ ట్రై చేయండి!

ముఖ్యంగా, మీల్ మేకర్ సోయాతో తయారైన నాణ్యమైనది ఉండాలి. నాసిరకమైన మీల్ మేకర్ అయితే, అది మెత్తగా ముద్దలా అయిపోతుంది. సోయాతో చేసిన మీల్ మేకర్ ఉడికినా గట్టిగా, ముక్కల రూపంలోనే ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? మీల్ మేకర్ మంచూరియన్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం!
meal maker
మీల్ మేకర్ మంచూరియన్‌కు కావలసిన పదార్థాలు
మీల్ మేకర్: 50 గ్రాములు
ఉప్పు: రుచికి సరిపడా
ఉల్లికాడల తరుగు: 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి: అర టీస్పూన్
వెనిగర్: 1 టీస్పూన్
టమాటా సాస్: 2 టేబుల్ స్పూన్లు
సోయా సాస్: 1 టీస్పూన్
షెజ్వాన్ సాస్: 1 టీస్పూన్
పచ్చిమిర్చి: 4 (తరిగినవి)
వెల్లుల్లి తరుగు: అర టీస్పూన్
అల్లం తరుగు: అర టీస్పూన్
కార్న్ ఫ్లోర్: 3 టేబుల్ స్పూన్లు
మైదాపిండి: 2 టేబుల్ స్పూన్లు
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
కొత్తిమీర: అలంకరణకు కొద్దిగా

తయారీ విధానం
ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసి, మీల్ మేకర్‌ను వేయండి. 10 నిమిషాలు నానబెట్టి, మెత్తగా అయ్యాక చేత్తో బాగా పిండి నీళ్లను తీసేయండి.ఈ మీల్ మేకర్‌ను ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో ఉప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ (లేదా తరుగు), మైదాపిండి, కార్న్ ఫ్లోర్, సోయా సాస్, షెజ్వాన్ సాస్ వేసి బాగా కలపండి. ఈ మిశ్రమం బాగా పట్టేలా ఉండాలి.

స్టవ్ మీద కళాయి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేయండి.కలిపిన మీల్ మేకర్ మిశ్రమాన్ని చిన్న చిన్న బంతులుగా చేసి, నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. తర్వాత తీసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోండి.
Meal Maker benefits
మరో కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి.అందులో వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసి ఒక నిమిషం వేయించండి.తర్వాత పచ్చిమిర్చి, ఉల్లికాడల తరుగు వేసి బాగా వేయించండి.ఇప్పుడు ఉప్పు, మిరియాల పొడి, షెజ్వాన్ సాస్, టమాటా సాస్, సోయా సాస్, వెనిగర్ వేసి బాగా కలపండి.ఒక చిన్న గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్‌ను కొద్దిగా నీటిలో కలిపి, ఈ మిశ్రమాన్ని కళాయిలో పోసి కలపండి. ఈ సాస్ చిక్కగా మారే వరకు ఉడికించండి.

చిక్కగా మారిన సాస్‌లో డీప్ ఫ్రై చేసిన మీల్ మేకర్ ముక్కలను వేసి, బాగా కలపండి. అన్నీ సమానంగా కోట్ అయ్యేలా చూసుకోండి.స్టవ్ ఆఫ్ చేసి, పైన కొత్తిమీర జల్లుకోండి.

వేడి వేడిగా ప్లేట్‌లో సర్వ్ చేయండి. వర్షాకాలంలో ఈ స్పైసీ మీల్ మేకర్ మంచూరియన్ తింటే ఆ రుచి, ఆ కిక్ వేరే లెవెల్! సోయాతో తయారైన మీల్ మేకర్ ఆరోగ్యానికి కూడా మంచిది, ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరం.ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి, త్వరగా తయారవుతుంది, రుచిలో రాజీపడనవసరం లేదు.