Kitchenvantalu

Wahing Machine:వాషింగ్ మెషిన్‌లో దుర్వాసన వస్తుందా? ఇలా చేస్తే అస్సలు రాదు..

Wahing Machine:వాషింగ్ మెషిన్‌లో దుర్వాసన వస్తుందా? ఇలా చేస్తే అస్సలు రాదు..వాషింగ్ మెషిన్‌ను కూడా అప్పుడప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. లేకపోతే, దీని నుంచి దుర్వాసన వస్తుంది. చాలా మందికి వాషింగ్ మెషిన్‌ను ఎలా శుభ్రం చేయాలో తెలియదు. దీని వల్లే మెషిన్ నుంచి చెడు వాసన వస్తుంటుంది.

వాషింగ్ మెషిన్ క్లీనింగ్: ఎందుకు దుర్వాసన వస్తుంది?
ఈ రోజుల్లో దుస్తులు కడుక్కోవడానికి వాషింగ్ మెషిన్‌లను ఎవరూ వాడకుండా ఉండరు. రెండు మూడు రోజులకు ఒకసారి ఖచ్చితంగా మెషిన్‌ను ఉపయోగిస్తాం. వాషింగ్ మెషిన్‌ల వల్ల దుస్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తెల్లగా అవుతాయి మరి త్వరగా ఆరుతాయి. అయితే, కొన్ని సార్లు ఈ మెషిన్‌ల నుంచి ఒక రకమైన దుర్వాసన వస్తుంటుంది. ఇది ఎందుకు వస్తుందో చాలామందికి తెలియదు.

నిజానికి, వాషింగ్ మెషిన్‌ను శుభ్రం చేయకపోవడం వల్లే ఇలా దుర్వాసన వస్తుంది. అలాగే, మెషిన్ తేమకు ఎక్కువగా గురైతే కూడా ఇలాంటి సమస్య వస్తుంది. తడి వల్ల మెషిన్‌లోపల బూజు, బ్యాక్టీరియా పేరుకుపోతాయి. ఇవి ముఖ్యంగా తలుపు, గాస్కెట్ కింద ఏర్పడితే ఖచ్చితంగా దుర్వాసన వస్తుంది. డ్రైన్ ట్యూబ్‌లో అడ్డంకులు ఏర్పడితే కూడా ఇలాంటి సమస్య వస్తుంది. అందుకే, ఇలాంటి సమస్యలు రాకుండా వాషింగ్ మెషిన్‌ను ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వాషింగ్ మెషిన్‌ను ఎలా శుభ్రం చేయాలి?
వాషింగ్ మెషిన్‌ను బేకింగ్ సోడా, వెనిగర్‌తో సులభంగా శుభ్రం చేయవచ్చు. 1/4 కప్ బేకింగ్ సోడాకు 1/4 కప్ నీళ్లు పోసి బాగా కలపండి. దీన్ని డిటర్జెంట్ కంటైనర్‌ను ఓపెన్ చేసి పోయండి.వైట్ వెనిగర్‌ను డైరెక్ట్‌గా వాషర్ డ్రమ్‌లో పోయండి.ఇప్పుడు మెషిన్‌ను ఆన్ చేయండి. వాసన పోయే వరకు రన్ చేయండి.మెషిన్ పైన మరకలు ఉంటే స్పాంజ్‌తో శుభ్రం చేయండి.

వాషింగ్ మెషిన్ గాస్కెట్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేయండి. ఎందుకంటే, దీనిలో బూజు ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని శుభ్రం చేయడానికి వైట్ వెనిగర్‌కు సమానంగా నీళ్లు తీసుకుని కలపండి. దీన్ని స్క్రబ్ బ్రష్‌తో శుభ్రం చేయండి.గాస్కెట్‌లో బూజు లేదా రబ్బరు ముక్కలు ఇరుక్కుపోయే అవకాశం ఉంది. కాబట్టి, వెనిగర్‌ను నీళ్లతో మిక్స్ చేసి దానితో శుభ్రంగా తుడవండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాతే దుస్తులను వేయండి.

అదనపు చిట్కాలు:
మెషిన్ ఉపయోగించిన ప్రతిసారి గాస్కెట్‌ను ఖచ్చితంగా తుడవాలి. ఇలా చేస్తే బూజు, బ్యాక్టీరియా ఏర్పడకుండా ఉంటాయి.డ్రమ్, రబ్బరు పట్టీ, చక్రాల మధ్య పూర్తిగా ఆరేలా మెషిన్ డోర్‌ను తెరిచి ఉంచాలి.బేకింగ్ సోడా, అల్యూమ్‌తో క్లీనింగ్ కి బెకింగ్ సోడా, అల్యూమ్‌తో కూడా వాషింగ్ మెషిన్‌ను శుభ్రం చేయవచ్చు. దీన్ని వారానికి ఒకసారి లేదా నెలకు నాలుగు సార్లు వాడవచ్చు.

సగం బకెట్ గోరువెచ్చని నీళ్లలో 4 లేదా 5 టీస్పూన్ల బేకింగ్ సోడాను, 2 నుంచి 3 టీస్పూన్ల అల్యూమ్ పౌడర్‌ను వేసి కరిగిపోయే వరకు కలపండి.ఖాళీగా ఉన్న వాషింగ్ మెషిన్ డ్రమ్‌లోపల ఈ మిశ్రమాన్ని పోయండి.మెషిన్‌ను 5 నుంచి 10 నిమిషాల పాటు ఆన్ చేయండి.తర్వాత కొద్దిసేపు ఆఫ్ చేసి, మళ్లీ మిశ్రమాన్ని పోసి రన్ చేయండి.అర్థగంట పాటు అలాగే వదిలేయండి.ఈ మిశ్రమం దుర్వాసన, బూజును పూర్తిగా తొలగిస్తుంది. చివరిగా, డ్రెయిన్‌ను నీళ్లు పోసి శుభ్రం చేస్తే సరిపోతుంది.

ఈ పద్ధతులను అనుసరిస్తే వాషింగ్ మెషిన్ నుంచి ఎప్పుడూ దుర్వాసన రాకుండా ఉంటుంది. మీ మెషిన్‌ను రెగ్యులర్‌గా శుభ్రం చేయండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.