Jamun Seeds Powder:మధుమేహానికి అద్భుత ఔషధం.. ఎలా మ్యాజిక్ చేస్తుందో..
Jamun Seeds Powder:మధుమేహానికి అద్భుత ఔషధం.. ఎలా మ్యాజిక్ చేస్తుందో.. నేరేడు పండ్లు సీజన్‌లో లభించకపోయినా, వాటి గింజల పొడి మాత్రం సులభంగా దొరుకుతుంది. ఈ పొడి కూడా ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం. ఆయుర్వేదంలో దీన్ని మూలికగా ఉపయోగిస్తారు, అనేక ఔషధాల తయారీలో భాగం చేస్తారు. నేరేడు గింజల పొడి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది, పలు వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: డార్క్ సర్కిల్స్ బాధపెడుతోందా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ప్రాబ్లమ్ ఫిక్స్!
మధుమేహ నియంత్రణలో…
మధుమేహం ఉన్నవారు భోజనానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నేరేడు గింజల పొడిని కలిపి తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ పొడిలో ఉండే జంబోలైన్, జంబోసైన్ వంటి సమ్మేళనాలు చక్కెరను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. టైప్-2 మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరం. అతిదాహం, అతి మూత్రవిసర్జన వంటి సమస్యలు తగ్గుతాయి.
యాంటీఆక్సిడెంట్ల సమృద్ధి…
నేరేడు గింజల పొడిలో ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. దీని యాస్ట్రింజెంట్ గుణాల వల్ల పేగుల వాపు, విరేచనాలు నయమవుతాయి. జీర్ణాశయం, పేగుల్లోని అల్సర్లు కూడా తగ్గుతాయి. రక్తనాళాల వాపు తగ్గి, గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది.
ఇది కూడా చదవండి:ఏవేవో వాడే బదులు ఆవాల నూనెలో కలిపి రాయండి.. రాలిపోయిన జుట్టు తిరిగి ఒత్తుగా పెరుగుతుంది..
ఫ్యాటీ లివర్ సమస్యకు…
ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఈ పొడి ఎంతో ఉపయోగకరం. లివర్‌లో పేరుకుపోయిన వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్తాయి. రోజూ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, సీజనల్ అనారోగ్యాల నుంచి రక్షణ లభిస్తుంది.
ఎలా తీసుకోవాలి?
రోజుకు 1-2 టీస్పూన్ల పొడిని నీళ్లు లేదా మజ్జిగలో కలిపి తాగండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

