Money Saving Tips:మహిళలు వంట పద్ధతుల్లో చిన్న మార్పులు చేస్తే సంవత్సరానికి రూ.1 లక్ష వరకు ఆదా సాధ్యం
Money Saving Tips:మహిళలు వంట పద్ధతుల్లో చిన్న మార్పులు చేస్తే సంవత్సరానికి రూ.1 లక్ష వరకు ఆదా సాధ్యం..ఇంటి గడప దాటకుండానే వంట చేసే మహిళలు కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటిస్తే సంవత్సరానికి లక్ష రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. వినడానికి అతిశయోక్తిగా అనిపించినా, ఇది పూర్తిగా వాస్తవమే.
ఇంటిని సమర్థవంతంగా నిర్వహిస్తే ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రత్యేకించి ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ వృథా ఖర్చులను అరికట్టడం ద్వారా గణనీయమైన మొత్తాన్ని పొదుపు చేయవచ్చు. వంట పద్ధతుల్లో చిన్న మార్పులు ఎలా సహాయపడతాయో ఇక్కడ చూద్దాం.
ఇది కూడా చదవండి:మధుమేహానికి అద్భుత ఔషధం.. ఎలా మ్యాజిక్ చేస్తుందో..
గ్యాస్ ఆదా చిట్కాలు – పెద్ద మొత్తంలో పొదుపు
అనేక కుటుంబాలు నెలకు ఒక సిలిండర్ వినియోగిస్తుంటాయి. కానీ సరైన పద్ధతులు అనుసరిస్తే రెండు నెలలకు ఒక సిలిండర్‌కే పరిమితం చేయవచ్చు – అంటే సంవత్సరానికి కేవలం 6 సిలిండర్లు మాత్రమే!
అన్నం ఉడికించేటప్పుడు: బియ్యాన్ని 15-20 నిమిషాలు నీళ్లలో నానబెట్టి వండితే త్వరగా ఉడుకుతుంది, గ్యాస్ తక్కువ వాడుతుంది.
కుక్కర్ ఉపయోగం: స్టీల్ పాత్రలకు బదులు ప్రెషర్ కుక్కర్ వాడితే వంట సమయం, గ్యాస్ రెండూ ఆదా అవుతాయి.
కూరగాయలు వండేటప్పుడు: పాత్రకు మూత పెట్టి వండితే ఆవిరి బయటకు పోదు, కూరలు త్వరగా మెత్తబడతాయి.
ఆహార వృథాను తగ్గించండి
ప్రతిరోజూ వండే పరిమాణాన్ని అంచనా వేసి, అవసరమైనంత మాత్రమే వండండి. మిగిలిన కూరలు, పప్పు, కూరగాయలను ఫ్రిజ్‌లో స్టోర్ చేసి మరుసటి రోజు వాడుకోండి. ఇలా చేయడం వల్ల ఆహార పదార్థాలు వృథా కాకుండా ఉంటాయి.మళ్లీ వండే సమయం, గ్యాస్, నూనె ఆదా అవుతాయి.
నూనె వినియోగంలో జాగ్రత్త
వంట నూనెను సమర్థవంతంగా వాడటం ఆరోగ్యానికి, ఆర్థిక ఆదాకూ మేలు చేస్తుంది.వేపుళ్లు, డీప్ ఫ్రై ఆహారాలను తగ్గించండి.ఆవిరి వంట, ఉడికించిన వంటకాలు, గ్రిల్ చేసిన ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వండి.నూనెను మళ్లీ మళ్లీ వేడి చేయకుండా ఒక్కసారే వాడి, మిగిలినది ఫిల్టర్ చేసి స్టోర్ చేసుకోండి.
ఈ చిన్న మార్పులు కేవలం డబ్బు ఆదా చేయడమే కాక, ఆరోగ్యాన్ని కాపాడుతాయి, సమయాన్ని ఆదా చేస్తాయి. ఇంటి ఆడపిల్లలు ఈ పద్ధతులు అలవాటు చేసుకుంటే కుటుంబ ఆర్థిక భద్రతకు బలమైన బండ బలం అవుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

