Healthhealth tips in telugu

Squats Benefits: రోజూ 30 గుంజీలు తీయాల్సిందే.. ఎందుకంటే ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేస్తుంది!

Squats Benefits: రోజూ 30 గుంజీలు తీయాల్సిందే.. ఎందుకంటే ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేస్తుంది..చిన్నతనంలో స్కూలు గడ్డిపై.. పద్యం మరచిపోయినా, మ్యాథ్స్‌లో తక్కువ మార్కులు వచ్చినా టీచర్లు మనల్ని గుంజీలు తీపించి శిక్షించేవారు. ఆ రోజుల జ్ఞాపకాలు ఇప్పటికీ మనసులో నిలిచిపోయాయి కదా!

కానీ పెద్దయ్యాక కూడా రోజూ 30 గుంజీలు తీయమని ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ సలహా ఇస్తున్నారు. ఇది కేవలం చేతుల వ్యాయామం కాదు, మొత్తం శరీరానికి ఫుల్ బాడీ వర్కౌట్‌గా పనిచేస్తుంది. గుంజీలు తీయడం వల్ల శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి:ఈ ఒక్క నూనె రాస్తే… తెల్ల జుట్టు కూడా నల్లగా మెరిసిపోతుంది..
పొట్ట కండరాలకు బలోపేతం:
రోజూ 30 గుంజీలు తీస్తే.. కొద్ది వారాల్లోనే మీ శరీరంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. పొట్ట చుట్టూ ఉన్న కండరాలు బలపడి, ఫ్లాట్ బెల్లీ ఆకృతి వస్తుంది. వెన్నునొప్పి బాధితులకు ఇది బెస్ట్ రెమెడీ. వెన్నెముక చుట్టూ ఉన్న మసిల్స్ బలంగా మారి, నొప్పులు రాకుండా కాపాడతాయి.

గుండె ఆరోగ్యం బూస్ట్:
గుంజీలు రోజూ చేస్తే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, రక్తంలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. గుండెపై ఒత్తిడి తగ్గి, హార్ట్ ప్రాబ్లమ్స్ దూరంగా ఉంటాయి. వయసు పెరిగినా గుండెను యంగ్‌గా, హెల్దీగా ఉంచే సహజ మార్గం ఇదే!
ఇది కూడా చదవండి:నెలరోజులు ఇవి రోజూ తింటే… మీ వయసు 10 ఏళ్లు తగ్గినట్టు కనిపిస్తుంది..!
గ్యాస్, అజీర్తి సమస్యలకు చెక్:
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది గుంజీలతో. పేగుల కండరాలు స్ట్రాంగ్ అయి, మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి ఇబ్బందులు క్రమంగా తగ్గిపోతాయి. అంతర్గత అవయవాలు స్మూత్‌గా పనిచేయడానికి అవసరమైన మూవ్‌మెంట్ ఇస్తాయి ఈ గుంజీలు.

క్యాలరీలు ఝల్లుమంటూ బర్న్:
బరువు తగ్గాలనుకునేవారికి గుంజీలు సూపర్ వర్కౌట్. మెటబాలిజం స్పీడ్ పెరిగి, కేలరీలు వేగంగా కరిగిపోతాయి. తొడలు, పిరుదుల వద్ద పేరుకుపోయిన ఫ్యాట్ మాయమై, శరీరం పర్ఫెక్ట్ షేప్‌లోకి వస్తుంది. బరువు తగ్గడం అందం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా అతి ముఖ్యం!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."