Beauty TipsHealthhealth tips in telugu

Face Glow Tips:చర్మాన్ని గాజు లాగా మెరిసేలా చేయండి – అలోవెరా జెల్‌తో సులభమైన హోమ్ రెమెడీ..

Face Glow Tips:చర్మాన్ని గాజు లాగా మెరిసేలా చేయండి – అలోవెరా జెల్‌తో సులభమైన హోమ్ రెమెడీ..ఇప్పుడు సోషల్ మీడియాలో “కొరియన్ గ్లాస్ స్కిన్” ట్రెండ్ ఎవరినీ వదలట్లేదు. చర్మం పద్మిని గాజు మాదిరి పారదర్శకంగా, మెరుపుగా కనిపిస్తేనే దాన్ని గ్లాస్ స్కిన్ అంటారు. దీనికి లక్షలు ఖర్చు పెట్టాలని చాలా మంది భయపడుతుంటారు… కానీ నిజానికి ఇంట్లోనే ఉన్న మూడు సాధారణ పదార్థాలతోనే ఈ మెరుపు సాధ్యమవుతుందని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

కావాల్సిందల్లా:
తాజా ఆలోవెరా జెల్ – 1 టేబుల్ స్పూన్
బియ్యం నీరు (రైస్ వాటర్) – 1 టేబుల్ స్పూన్
స్వచ్ఛమైన తేనె – 1 టీస్పూన్

రైస్ వాటర్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు:
అర్ధ గిన్నె బియ్యాన్ని 30–40 నిమిషాలు నీటిలో నానబెట్టి, ఆ నీటిని వడకట్టి పక్కన పెట్టుకోండి. ఇది చర్మాన్ని లైట్‌నింగ్ చేసి, మసక తగ్గించి, సూపర్ స్మూత్‌గా మారుస్తుంది.
ALSo Read:చలికాలంలో తేనె తింటే వచ్చే అద్భుత ఆరోగ్య లాభాలు.. నమ్మటం కష్టమే.

మాస్క్ తయారీ & వాడకం (5 నిమిషాల్లో రెడీ!)
మూడు పదార్థాలనూ ఒక గిన్నెలో వేసి బాగా కలపండి.ముఖాన్ని మైల్డ్ ఫేస్‌వాష్‌తో క్లీన్ చేసుకుని, ఈ మిశ్రమాన్ని సన్నని లేయర్‌లా అప్లై చేయండి.15–20 నిమిషాలు రిలాక్స్ అయి ఉండి, గోరువెచ్చని నీటితో కడిగేయండి.వారంలో 2–3 సార్లు రిపీట్ చేయండి – ఒకటి–రెండు వారాల్లోనే చర్మం గ్లో అనిపిస్తుంది!

ఈ మూడు పవర్‌ఫుల్ ఇంగ్రీడియెంట్స్ ఏం చేస్తాయి?
ఆలోవెరా → డీప్ హైడ్రేషన్ + కూలింగ్ + ఇర్రిటేషన్ తగ్గిస్తుంది
రైస్ వాటర్ → బ్రైట్‌నెస్ పెంచుతుంది, పోర్స్ టైట్ చేస్తుంది, ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది
తేనె → నాచురల్ హ్యూమెక్టెంట్ – తేమను లాక్ చేసి, సాఫ్ట్ & ప్లంపీ లుక్ ఇస్తుంది
ALSO READ:రూ.6,725 విలువ గల మిక్సర్ కేవలం రూ.3,199కే.. 52 శాతం తగ్గింపుతో..
ముఖ్య గమనిక:
సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు ముందుగా చేయి మీద ప్యాచ్ టెస్ట్ తప్పనిసరి. ఆలోవెరా లేదా తేనెకు అలర్జీ ఉంటే దూరంగా ఉండండి.
గ్లాస్ స్కిన్ ఒక్క మాస్క్‌తోనే రాదు… దీనితో పాటు:

రోజూ ౩ లీటర్ల నీరు తాగండి
ఎప్పుడూ సన్‌స్క్రీన్ మర్చిపోకండి
8 గంటల నిద్ర తప్పనిసరి
హెవీ మేకప్ తగ్గించండి..

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద ఇచ్చిన లింక్ ని copy చేసి చూడండి
https://www.telugulifestyle.com/