BusinessToday gold rate

Today Gold Rate:రాకెట్ వేగంతో ఎగసిన బంగారం ధరలు.. సరికొత్త రికార్డు సృష్టించిన పుత్తడి ధరలు..

Today Gold Rate:రాకెట్ వేగంతో ఎగసిన బంగారం ధరలు.. సరికొత్త రికార్డు సృష్టించిన పుత్తడి ధరలు..డిసెంబర్ 13, శనివారం బంగారం ధరలు ఆల్ టైం హైను తాకాయి. నేడు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,37,290కు చేరి రికార్డు నమోదు చేసింది. 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ. 1,22,000గా ఉంది. అలాగే ఒక కేజీ వెండి ధర రూ. 2,01,450కు పలుకుతోంది.

ఈ రోజు బంగారం ధరలు మరోసారి గరిష్ట స్థాయిని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ భారీగా తగ్గడం ప్రధాన కారణం. డాలర్ బలహీనతతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ట్రెజరీ బాండ్ల నుంచి నిధులను ఉపసంహరించుకుని, సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా బంగారంవైపు మళ్లుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.

అక్టోబర్ 20న 10 గ్రాముల బంగారం ధర రూ. 1.35 లక్షలతో రికార్డు సృష్టించగా, నేడు ఆ రికార్డును బద్దలుకొట్టి రూ. 1.37 లక్షలు దాటి కొత్త గరిష్టాన్ని అందుకుంది. అంతర్జాతీయంగా ఒక ఔన్స్ (31.2 గ్రాములు) బంగారం ధర $4,332కు చేరి ఏడు వారాల గరిష్ట స్థాయిని తాకింది.
ALSO READ:ఈ రెండిటిలో ఏ బ్రేక్‌ఫాస్ట్‌ తింటే.. బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది..
ఈ నేపథ్యంలో పసిడి ఆభరణాల కొనుగోలు కష్టతరమవుతోంది. అయితే బంగారంలో పెట్టుబడి పెట్టినవారికి మాత్రం భారీ లాభాలు వస్తున్నాయి. చాలా మంది ఇన్వెస్టర్లు గోల్డ్ ETFల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.

వెండి ధరలు కూడా రికార్డులు బద్దలుకొడుతున్నాయి. ఒక కేజీ వెండి రూ. 2 లక్షలు దాటి పలుకుతోంది. ఇండస్ట్రియల్ డిమాండ్ భారీగా పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఇన్వెస్టర్లు సిల్వర్ ETFల వైపు మళ్లుతున్న నేపథ్యంలో ధరలు మరింత ఎగస్తున్నాయి.

పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి పెట్టుబడి సాధనాలన్నీ లాభనష్టాలకు లోనవుతాయి. మీ పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి బాధ్యతా chaipakodi వహించదు. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించండి.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/