Kitchen Tips:వంటింట్లో పనులు చేసేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన చిట్కాలు ఇవే..
Kitchen Tips:వంటింట్లో పనులు చేసేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన చిట్కాలు ఇవే.. వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచినా, ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి మిగిలిపోతూనే ఉంటుంది. కత్తులు పదును పెట్టడం, స్టవ్ శుభ్రం చేయడం, వంటను సులభంగా చేయడం – ఇవన్నీ చిన్నపాటి టాస్కులు కావు. అందుకే ఈరోజు టిప్ ఆఫ్ ది డేలో కొన్ని ఉపయోగకరమైన కిచెన్ టిప్స్ గురించి చూద్దాం!
వంట చేసేటప్పుడు స్టవ్ మీద పాలు పొంగినా లేదా సాంబారు, కూరలు చిందినా వెంటనే శుభ్రం చేసేయండి. అలా చేస్తే మరకలు పట్టకుండా ఉంటాయి. ముందుగానే కూరగాయలు కోసి సిద్ధం చేసుకుంటే వంట త్వరగా పూర్తవుతుంది.
ALSO READ:ప్రతి రోజు ఉపయోగపడే వంటింటి చిట్కాలు.. కానీ అందరికి తెలియవు..
కత్తులు పదునుగా ఉంటే కూరగాయలు కోయడం సులభం మరియు ఆనందంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ షార్పనర్ లేదా సాధారణ సాన రాయి ఉపయోగించవచ్చు. ఇంట్లో సిరామిక్ కప్ ఉంటే, దాని దిగువ భాగంలోని గరుకైన రింగ్ మీద కత్తిని రుద్ది పదును పెట్టవచ్చు – ఇది సులభమైన ట్రిక్!
వాడిన కత్తులను వెంటనే కడిగి, తువ్వాలు లేదా పేపర్ టవల్‌తో తుడిచి పొడిగా ఉంచండి. తడి వదిలేస్తే తుప్పు పడుతుంది. కూరగాయలు కోసేటప్పుడు చెత్త కోసం కౌంటర్ మీద ఒక గిన్నె పెట్టుకుంటే శుభ్రం చేయడం చాలా సులభం అవుతుంది.
ALSO READ:మిగిలిన సబ్బు ముక్కలను వృథా చేయకుండా… ఇలా చేస్తే నల్లని మచ్చలు మాయం
బీట్రూట్ హల్వా చేసేటప్పుడు ముందుగా బీట్రూట్ను పాలలో ఉడికించి తీసుకుంటే రంగు, రుచి రెట్టింపు అవుతాయి.
దోసె పిండి త్వరగా పులియాలంటే కొంచెం కొబ్బరి నీళ్లు కలపండి – ఇది సహజంగా ఫర్మెంటేషన్ను వేగవంతం చేస్తుంది.
టమాటాలు త్వరగా మెత్తబడాలంటే ఉడికించేటప్పుడు చిటికెడు చక్కెర వేయండి.
కాకరకాయ వండేటప్పుడు రెండు పచ్చి మామిడి ముక్కలు వేస్తే చేదు తగ్గి రుచిగా ఉంటుంది.
చపాతీ పిండిలో కొద్దిగా ఉడికించిన బంగాళదుంప ముద్ద కలిపితే చపాతీలు మెత్తగా, రుచిగా వస్తాయి మరియు ఎక్కువసేపు మెత్తగానే ఉంటాయి.
వంటగదిలో దుర్వాసన వస్తుంటే కమలాపండు తొక్కలు లేదా ఆరెంజ్ పీల్స్‌ను లవంగాలతో కలిపి నీటిలో ఉడికిస్తే వాసన పోయి ఇంటంతా మంచి సుగంధం వ్యాపిస్తుంది.ఈ చిన్న చిన్న టిప్స్‌తో మీ వంటగది పనులు సులభం అవుతాయి.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

