Laddu:రోజుకి ఒక లడ్డూ తింటే జీవితాంతం నరాలు, ఎముకలు బలంగా… పాదాల నొప్పి, మైకం, డయాబెటిస్ రావు!
Lddu:రోజుకి ఒక లడ్డూ తింటే జీవితాంతం నరాలు, ఎముకలు బలంగా… పాదాల నొప్పి, మైకం, డయాబెటిస్ రావు.. ఈ రోజుల్లో వయస్సు లెక్క చేయకుండా చాలా మందికి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, కండరాల బలహీనత, అలసట, శరీరంలో బలం లేకపోవడం, అధిక రక్తపోటు, ముఖ కాంతి తగ్గడం, కంటి చూపు సమస్యలు వంటివి సాధారణంగా వస్తుంటాయి. ఇలాంటి సమస్యలకు ఇంటి చిట్కాలు, సహజమైన ఆహారాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్), నువ్వులు, బాదం, కిస్మిస్, గోధుమ పిండి మరియు బెల్లంతో తయారు చేసే ఈ ఆరోగ్యకరమైన లడ్డూ శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలను అందిస్తుంది. ఇవి కీళ్ల నొప్పులు తగ్గించడం, ఎముకలు బలోపేతం చేయడం, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం, అలసట తగ్గించడం, రక్తపోటు సమతుల్యం చేయడం వంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
ALSO READ:రూ. 15 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు – మాములు కాదు, అద్భుతం!
తయారీ విధానం:
ఒక కప్ అవిసె గింజలు మరియు ఒక కప్ తెల్ల నువ్వులను వేర్వేరుగా వేయించి, చల్లార్చి పొడి చేసుకోండి.కొద్దిగా నెయ్యి వేసి పాన్లో 10 బాదం పప్పులు, 10 కిస్మిస్లను వేయించి, పొడి చేసి పక్కన పెట్టుకోండి.అదే పాన్లో మరో కొద్దిగా నెయ్యి వేసి, ఒక కప్ గోధుమ పిండిని తక్కువ మంటపై వేయించి పక్కన పెట్టుకోండి.ఒకటిన్నర కప్ బెల్లాన్ని తీగ పాకం కంటే కొద్దిగా తక్కువగా (మెత్తని పాకం) పట్టి చల్లారనివ్వండి.
ALSO READ:రోజూ ఒక్కసారి తాగితే … నరాల బలహీనత నుంచి గుండె సమస్యల వరకు ఏవీ రావు!
ఒక పెద్ద గిన్నెలో అవిసె-నువ్వుల పొడి, బాదం-కిస్మిస్ పొడి, వేయించిన గోధుమ పిండి, బెల్లం పాకాన్ని బాగా కలిపి, చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి.రోజుకి ఒక లడ్డూ తీసుకుంటే శరీరం బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఒక్కసారి తయారు చేస్తే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సురక్షితంగా తినవచ్చు.
గమనిక: ఇది సాంప్రదాయ ఇంటి చిట్క. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి.ఈ లడ్డూ రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యవంతమైనది కూడా! ఒక్కసారి ట్రై చేసి చూడండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

