బజ్జీలు, పునుగులు న్యూస్ పేపర్‌లో పెట్టి తింటున్నారా? ఐసీఎంఆర్ (ICMR) సీరియస్ వార్నింగ్.. క్యాన్సర్ ముప్పు ఎక్కువే!
బజ్జీలు, పునుగులు న్యూస్ పేపర్‌లో పెట్టి తింటున్నారా? ఐసీఎంఆర్ (ICMR) సీరియస్ వార్నింగ్.. క్యాన్సర్ ముప్పు ఎక్కువే.. సాయంత్రం కాగానే రోడ్డు పక్కన బజ్జీలు, సమోసాలు, పునుగులు లాగిస్తుంటాం. అయితే, వ్యాపారులు వీటిని తరచుగా న్యూస్ పేపర్‌లో చుట్టి ఇస్తుంటారు. లేదా ప్లేట్ పైన పేపర్ వేసి ఇస్తారు. ఆకలి మీద ఉన్న మనం అది గమనించకుండా తినేస్తాం. కానీ ఇది ప్రాణాంతకం కావచ్చు.
డేంజర్ ఎక్కడ ఉంది? వార్తాపత్రికల ముద్రణకు వాడే సిరా (Ink)లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఇందులో లెడ్ (Lead), ఇతర హెవీ మెటల్స్ ఉంటాయి. వేడి వేడి పదార్థాలను పేపర్‌పై వేయగానే, ఆ వేడికి సిరా కరిగి ఆహారానికి అంటుకుంటుంది.
ALSO READ:అన్నం తిన్న వెంటనే గ్లాసుల కొద్దీ నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు
ఐసీఎంఆర్ (ICMR) హెచ్చరిక: ఫుడ్ సేఫ్టీ అథారిటీ (FSSAI) మరియు ICMR చెబుతున్న ప్రకారం.. ఇలా పేపర్‌లో ఆహారం తినడం వల్ల:ఆ కెమికల్స్ కడుపులోకి చేరి జీర్ణ సంబంధిత వ్యాధులకు దారితీస్తాయి.దీర్ఘకాలంలో ఇది క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది.కాబట్టి, పేపర్‌లో చుట్టిన ఆహారాన్ని తినకండి. టిష్యూ పేపర్స్ లేదా అరటి ఆకులను వాడటం ఉత్తమం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

