Cold Remedies:కేవలం 3 సార్లు తాగితే చాలు.. దగ్గు, జలుబు, కఫం చిటికెలో మాయం..
Cold Remedies:కేవలం 3 సార్లు తాగితే చాలు.. దగ్గు, జలుబు, కఫం చిటికెలో మాయం.. వాతావరణం మారితే చాలు.. చాలామందికి మొదట వచ్చే సమస్యలు జలుబు, దగ్గు, గొంతునొప్పి. వీటిని చిన్న సమస్యలే కదా అని లైట్ తీసుకుంటే.. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరానికి దారితీస్తాయి. ఈ సమస్యలు ఒక్కసారి వచ్చాయంటే అంత త్వరగా వదలవు.
అయితే, హాస్పిటల్స్ చుట్టూ తిరిగే పని లేకుండా, మన వంటింట్లో దొరికే వాటితోనే కేవలం నిమిషాల్లో ఉపశమనం పొందవచ్చు. ఆ అద్భుతమైన చిట్కా ఏంటో ఇప్పుడే చూసేయండి!
కావాల్సిన పదార్థాలు:
ఒక గ్లాసు నీళ్లు
చిన్న అల్లం ముక్క
3 లవంగాలు
చిన్న దాల్చిన చెక్క ముక్క (లేదా పొడి)
అర చెంచా తేనె
తయారీ విధానం ఇలా:
ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీళ్లు పోయాలి.అందులో అల్లం ముక్క, 3 లవంగాలు, దాల్చిన చెక్క వేయాలి.వీటిని 6 నుంచి 7 నిమిషాల పాటు సన్నని మంట (Sim) మీద బాగా మరిగించాలి.నీరు మరిగిన తర్వాత వడకట్టుకుని, గోరువెచ్చగా అయ్యాక అరస్పూన్ తేనె కలుపుకోవాలి.
ఎప్పుడు తాగాలి?
ఈ కషాయాన్ని ఉదయం, సాయంత్రం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఇలా కేవలం 3 రోజులు చేస్తే చాలు.. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఛాతిలో కఫం ఇట్టే కరిగిపోతాయి.
దీని వల్ల లాభాలేంటి?
అల్లం, లవంగాలు, దాల్చినచెక్క, తేనెలో ఉండే ఔషధ గుణాలు మీ శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) అమాంతం పెంచుతాయి. జలుబు లేకపోయినా, ఈ సీజన్లో రెండు రోజులకోసారి దీన్ని తాగితే ఆరోగ్యానికి డోకా ఉండదు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

