Parsley :శరీరంలో రక్తం కొరత ఉందా? కొత్తిమీరలా కనిపించే ఈ ఆకుతో రక్తహీనత మాయం!
Parsley :శరీరంలో రక్తం కొరత ఉందా? కొత్తిమీరలా కనిపించే ఈ ఆకుతో రక్తహీనత మాయం…శరీరంలో రక్తం తక్కువగా ఉండటం (రక్తహీనత లేదా ఎనీమియా) ఈరోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య. చిన్న పని చేసినా అలసిపోవడం, నీరసం లాంటి సమస్యలకు ఇదే ప్రధాన కారణం. అయితే, రక్తహీనతను తరిమికొట్టి.. ఒంట్లో రక్తం పరుగులు తీసేలా చేసే ఒక అద్భుతమైన ఆకు గురించి మీకు తెలుసా? అదే ‘పార్స్లీ’ (Parsley).
చూడటానికి అచ్చం మన కొత్తిమీరలాగే కనిపించే ఈ పార్స్లీ ఆకులు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మరి దీని ప్రయోజనాలు ఏంటి? దీన్ని ఎలా వాడాలో చూద్దాం..
పార్స్లీ ఆకులతో అద్భుత ప్రయోజనాలు ఇవే:
ఐరన్ గని: ఈ ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనత (Anemia) సమస్యను వేగంగా తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచి, కణాలకు ఆక్సిజన్‌ను చేరవేయడంలో ఎంతో సహాయపడుతుంది.
ఐరన్ గ్రహించే శక్తి: పార్స్లీలో ఐరన్‌తో పాటు విటమిన్ సి, కాల్షియం కూడా మెండుగా ఉంటాయి. ఇవి మనం తీసుకునే ఆహారం నుంచి శరీరం ఐరన్‌ను సులభంగా గ్రహించేలా (Iron absorption) చేస్తాయి.
రోగనిరోధక శక్తి: ఈ ఆకులు మన శరీరంలో ఇమ్యూనిటీని అమాంతం పెంచి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి.
బీపీ, షుగర్ కంట్రోల్: రక్తపోటు (BP) అదుపులో ఉంచడంతో పాటు, డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది.
పార్స్లీ ఆకులను ఎలా తీసుకోవాలి?
తాజా పార్స్లీ ఆకులు మనకు బయట మార్కెట్లో అంత సులభంగా దొరకవు. కానీ, సూపర్ మార్కెట్లలో లేదా ఆన్లైన్ స్టోర్లలో ‘పార్స్లీ టీ పొడి’ (Parsley Tea Powder) లేదా టీ బ్యాగ్స్ రూపంలో దొరుకుతాయి. వీటితో ఎంచక్కా టీ పెట్టుకుని తాగొచ్చు.
పార్స్లీ టీ తయారీ విధానం:
ఒక గ్లాసు నీటిని తీసుకుని, అందులో ఒక స్పూన్ పార్స్లీ టీ పొడి వేయాలి.చిన్న మంటపై (సిమ్‌లో) ఐదు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి.తర్వాత ఆ నీటిని వడకట్టి (ఫిల్టర్ చేసి).. గోరువెచ్చగా ఉన్నప్పుడు అర స్పూన్ తేనె కలుపుకుని తాగాలి.
ముఖ్య గమనిక: షుగర్ వ్యాధి (Diabetes) ఉన్నవారు మాత్రం తేనె కలపకుండా అలాగే తాగేయాలి.
ఉదయం, సాయంత్రం ఇలా ఈ టీ తాగితే.. రక్తహీనత సమస్య మాయమవ్వడమే కాకుండా, ఆరోగ్యం మీ సొంతం అవుతుంది!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

